Actress: 13 ఏళ్ల వయసులో హీరోయిన్.. కమల్ హాసన్, చిరంజీవితో బ్లాక్ బస్టర్స్.. ఎవరంటే..

Actress: 13 ఏళ్ల వయసులో హీరోయిన్.. కమల్ హాసన్, చిరంజీవితో బ్లాక్ బస్టర్స్.. ఎవరంటే..


ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సీనియర్ నటి చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్. కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రాల్లో నటించింది. బాలనటిగా తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత కథానాయికగా చక్రం తిప్పింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సినిమాల్లో కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈ హీరోయిన్ తోపాటు ఆమె చెల్లెల్లు ఇద్దరూ ఇండస్ట్రీలో తోపు యాక్టర్స్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? సీనియర్ నటి ఊర్వశి. ఆమె చెల్లెల్లు కల్పన, కళారంజని సైతం పాపులర్ యాక్టర్స్.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

భాగ్యరాజ్ దర్శకత్వం వహించి నటించిన ముంతానై ముడిచ్చు చిత్రంతో ఊర్వశి తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. కల్పన భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన చిన్నవీడు చిత్రంతో తమిళ సినిమాలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 1981లో విడుదలైన అన్రుముత్తల్ ఇద్నావర చిత్రం ద్వారా కూడా నటించింది. ఊర్వశి తమిళం, తెలుగు సినిమాల్లో అగ్ర హీరోల జోడిగా కనిపించింది. ప్రముఖ నటులతో అనేక విజయవంతమైన చిత్రాలను అందించింది. కానీ ఆమె మలయాళ సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసింది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

కామెడీ అయినా, కన్నీళ్లైనా, కోపమైనా, అసూయ అయినా, ఏ పాత్ర అయినా, సహజంగా నటించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ పాత్రలతో జనాలకు దగ్గరయ్యింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ఊర్వశి 13 సంవత్సరాల వయసులో తోతురుం వావాహ (1983) చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.ఆ చిత్రం మూడు సంవత్సరాల తరువాత, 1986లో విడుదలైంది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఊర్వశి కథానాయికగా చేసిన మొదటి చిత్రం ముంతనై ముడిచ్చు. అప్పటి నుండి, ఆమె మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషలలో 500 కి పైగా చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఊర్వశి కూతురు జయలక్ష్మి సైతం సినిమాల్లోకి తెరంగేట్రం చేయడానికి రెడీ అయ్యింది. త్వరలోనే కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *