ఐశ్వర్య మీనన్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో అలరించింది. కానీ తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి అంతగా అదృష్టం కలిసిరాలేదు. ఆమె చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.
తెలుగులో ఆమె నిఖిల్ సిద్ధార్థ్ జోడిగా స్పై చిత్రంతో అరంగేట్రం చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి సైతం ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు.
గ్లామర్, యాక్షన్ సీన్లతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది.
కొన్నాళ్లపాటు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ భజే వాయవేగం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ సైతం నిరాశే మిగిల్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా మోడ్రన్ చీరకట్టులో వయ్యారాలతో కవ్విస్తుంది ఈ చిన్నది. తాజాగా ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే యూత్ లో మంచి క్రేజ్ ఉంది.