యాక్టింగ్ అంటే విపరీతమైన ఇష్టం. చిన్నప్పటి నుంచే నటి కావాలని కలలు కంది. దీంతో స్కూల్ లైఫ్ మధ్యలోనే వదిలేసి ముంబైకి వెళ్లింది. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చింది. అదే సమయంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. అయినా పట్టు వదలకుండా అవకాశాల కోసం ప్రయత్నించింది. చివరకు 2008లో 1920 సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. కానీ ఆమె తొలి సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కూడా ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ 2023లో ఆమె నటించిన ఓ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె పేరు ఆదా శర్మ.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
అదా శర్మ తన కెరీర్‌ను 2008లో ప్రారంభించింది. ఆమె తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో హార్ట్ అటాక్ సినిమాతో అరంగేట్రం చేసింది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దాదాపు 15 సంవత్సరాలపాటు సరైన బ్రేక్ కోసం ఎదురుచూసింది. చివరకు 2023లో ది కేరళ స్టోరీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాతో ఆమె పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగింది. 15 సంవత్సరాల పాటు సరైన బ్రేక్ కోసం కష్టపడింది. ఈ సినిమాలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఈ సినిమా తర్వాత హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన ఆదా శర్మ ఇప్పుడు మళ్లీ సైలెంట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తెలుగులో హార్ట్ అటాక్ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..