Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..


Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

పైన ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినీయర్ హీరోల చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కథానాయికగా పలు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు యంగ్ హీరోహీరోయిన్ల చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ? తనే సీనియర్ నటి రోహిణి మొల్లేటి. సినీరంగంలో నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఇప్పుడు దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన నటిగా మారింది.

అనకాపల్లికి చెందిన రోహిణి.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. బాలనటిగా అనేక చిత్రాల్లో నటించిన తర్వాత ఆమె కథానాయికగానూ మెప్పించింది. రక్త సంబంధాలు, ఇంటింటి కథ, బలిపీఠం, భాగస్తులు, దేవుడు చేసిన బొమ్మలు, ఈతరం మనిషి ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న రోహిణి.. నాని, నిత్య మీనన్ కాంబోలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో మరోసారి తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇష్క్, శివ మనసులో శృతి, బహుబలి ది బిగినింగ్, షేర్, నేను శైలజ, టక్ జగదీష్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో మంది హీరోయిన్లకు గాత్రదానం చేశారు. గీతాంజలి సినిమాలో హీరోయిన్ పాత్రకు అద్భుతమైన గాత్రం అందించారు. తెలుగులో ఒక్క విజయశాంతికి తప్ప దాదాపు అందరూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. దివంగత నటుడు రఘువరన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రోహిణి. వీరికి ఒక బాబు ఉన్నాడు. కానీ కొన్నాళ్లకే మనస్పర్థలతో ఇద్దరు విడిపోయారు.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

 

View this post on Instagram

 

A post shared by Rohini Molleti (@rohinimolleti)

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *