
ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. మిస్టరీ, సస్పెన్స్, రొమాంటిక్ డ్రామా చిత్రాలు, వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్స్ సైతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ టాలీవుడ్ హీరోయిన్ ఓటీటీ క్వీన్ అనే చెప్పాలి. ఆమె కేవలం ట్రెండ్ ఫాలో కాలేదు. ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో బోల్డ్ చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆమె మరెవరో కాదు. రాధిక ఆప్టే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం సత్తా చాటుతుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
రాధిక ఆప్టే… ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలో బిజీగా ఉంటుంది. 1985 సెప్టెంబర్ 7న జన్మించిన రాధిక.. మొదట థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. 2005లో వాహ్! లైఫ్ హో తో ఐసీ! సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ 2015లో వచ్చిన బద్లాపూర్, హంటర్, మాంఝీ : ది మౌంటైన్ మ్యాన్ సినిమాలు ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలతో ఆమె తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది. గ్లామరస్ బ్యూటీగా, అటు సహజ నటనతో ఈ అమ్మడు ప్రశంసలు అందుకుంది. 2018 ఏడాది ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ ఒక్క ఏడాదిలోనే నెట్ ఫ్లిక్స్ లో ఆమె నటించిన మూడు ప్రాజెక్టులు విడుదలయ్యాయి. దీంతో ఆమె నెట్ ఫ్లిక్స్ ఓటీటీ క్వీన్ గా మారింది.
ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..
లస్ట్ స్టోరీస్ సినిమాతో ఆమె ఇండియన్ సినిమా రూల్స్ బ్రేక్ చేసింది. ఈ పాత్రకు ఆమెకు ఏకంగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్ కు నామినేట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సెక్రెడ్ గేమ్స్, ఘోల్, రాత్ అకేలీ హై, మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాలతో నటిగా తానెంటో ప్రూవ్ చేసుకుంది. ఇక 2024లో వచ్చిన సిస్టర్ మిడ్ నైడ్ సినిమాతో బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకుని.. ఇంటర్నేషనల్ లెవల్లో సత్తా చాటింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‌గా చెప్పేసిన హీరోయిన్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‌లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..