Actor : మొదటి సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఒక్క మూవీకి రూ.70 కోట్లు రెమ్యునరేషన్..

Actor : మొదటి సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఒక్క మూవీకి రూ.70 కోట్లు రెమ్యునరేషన్..


ఇండస్ట్రీలోకి హీరోగా సులభంగానే అరంగేట్రం చేశాడు. తండ్రి స్టార్ హీరో.. తల్లి ఫేమస్ నటి. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఏర్పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా మొదటి సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ చిత్రానికి అతడు కేవలం 250 మాత్రమే తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.70 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. అటు రొమాంటిక్, ఇటు మాస్ యాక్షన్ హీరోగానూ మెప్పించాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో మరెవరో కాదు.. ఇప్పుడు పాన్ ఇండియా సినీప్రియులకు ఇష్టమైన హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్. ఫిట్‌నెస్, లుక్, నటనతో కొట్లాది మంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్నాడు. బాలీవుడ్ హీరో దివంగత నటుడు రిషి కపూర్ తనయుడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రణబీర్.. 1996లో ప్రేమ్ గ్రంథ్ సినిమాకు పనిచేశారు. అప్పుడు అతడి జీతం 250 రూపాయాలు.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి తన తండ్రి రిషి కపూర్ దర్శకత్వం వహించారు. 2007లో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన సావరియా సినిమాతో హీరోగా మారారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత బచ్నా ఏ హసీనో, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ, రజనీతి లాంటి సినిమాలు మంచి వసూళ్లను రాబట్టినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2011లో వచ్చిన రాక్ స్టార్ అనే సినిమా రణబీర్ కెరీర్ మార్చింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఆ తర్వాత రణబీర్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లు రాబట్టాయి. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ నటించిన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ దాదాపు 899 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ సినిమాతో అతడు ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నివేదికల ప్రకారం రణబీర్ ఆస్తులు రూ.345 కోట్లు. ప్రస్తుతం నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రాముడి పాత్రను పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *