ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ జనాలను అలరిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అతడు హీరో మాత్రమే కాదు.. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు అతడు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా తనలోని మరో టాలెంట్ బయటపెట్టాడు. శివుడి పెయింటింగ్ అద్భుతంగా వేసి ఔరా అనిపించాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ?అతడే హీరో సుధీర్ బాబు. ప్రస్తుతం తన కొత్త సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తనలోని మరో కళను సైతం బయటపెట్టారు.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
తాజాగా తన చేతులో ఓ అద్భుతమైన శివ రూపాన్ని సృష్టించాడు. నీలకంఠుడి పెయింటింగ్ ఎంతో అందంగా వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో సుధీర్ బాబు మాట్లాడుతూ.. “నేను ఎవరి పెయింటింగ్ వేస్తున్నాననుకుంటున్నారు.. ? ఎవరైనా అందమైన అమ్మాయిల బొమ్మలు గీస్తుంటారు. నేను అందగాడి బొమ్మను గీస్తున్నా.. ఆయన ఎలాంటి అందగాడంటే అందాన్ని చందమామతో పోలుస్తాం కదా.. ఆ చందమామ ఆయన తలలో ఏదో ఒక మూలన పడి ఉంటుంది. అసలాయన అందం ముందు చందమామను ఎవరూ పట్టించుకోరు. మనమంతా అందంగా కనిపించడానికి హెయిర్ స్టైల్ చేసుకుంటే ఆయన అసలు జుట్టునే పట్టించుకోడు. ఆయన జుట్టు ఎప్పుడూ ఏదో దారాలు చిక్కుకున్నట్లు చిక్కుముడుల్లా ఉంటుంది. అందుకే ఆయన్ని జటాధర అని పిలుస్తారు. నేను ఒక బొమ్మ తీశాను. ఆ బొమ్మే జటాధర. అందరూ థియేటర్లలో చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుధీర్ బాబు షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
జటాధర చిత్రంలో సోనాక్షఇ సిన్హా, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శిరోద్కర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలలో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..