ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలకు అతడు కేరాఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తన నటనతో ఇండస్ట్రీలో ముద్ర వేశారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలకు దూరమయ్యాడు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యారు. సంవత్సరాల తరబడి మద్యపానానికి బానిసైన ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సినిమాల్లో యాక్షన్, బెదిరింపులకు ఒకప్పుడు పేరుగాంచిన, హిందీ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసిన వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా డయాలసిస్ ద్వారా జీవిస్తున్నాడు. అతడి రెండు కిడ్నీలు పాడయ్యాయి. అతడు పేరు పొన్నంబలం.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..
పొన్నంబలం తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. 90’s లలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, శరత్ కుమార్, సత్యరాజ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కనిపించాడు. స్టంట్‌మ్యాన్‌గా కెరీర్ ప్రారంభించ అనేక చిత్రాల్లో కనిపించాడు. అయితే చాలా కాలం క్రితం అతడి ఆరోగ్యం దెబ్బతింది. మద్యపాన వ్యసనం అతడి ప్రాణాలకు ముప్పుగా మారింది. 2021 నుంచి అతడు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. డయాలసిస్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన శిక్ష అని పొన్నంబలం ఇటీవలి ఇంటర్వ్యూలో అన్నారు. నాలుగు సంవత్సరాల్లో ఒకే చోట దాదాపు 750 ఇంజెక్షన్స్ చేయించుకున్నానని.. ఇప్పటివరకు సరిగ్గా పూర్తి భోజనం చేయలేదని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
చికిత్స కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని.. తనకు మెగాస్టార్ చిరంజీవి, ధనుష్, శరత్ కుమార్, అర్జున్ ఎంతో సాయం అందించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పొన్నంబలం చివరగా 2022లో కాటేరి సినిమాలో నటించారు.
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..