Headlines

Abhishek Sharma: శాంసన్ ఎంత చెప్పినా వినలే.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులో అభిషేక్ శర్మ.. అదేంటంటే?

Abhishek Sharma: శాంసన్ ఎంత చెప్పినా వినలే.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులో అభిషేక్ శర్మ.. అదేంటంటే?


Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు (India national cricket team) వర్సెస్ ఇంగ్లాండ్ (England national cricket team) జట్లు తలపడిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి నిరాశపరిచాడు. ముంబైలోని వాంఖడే (Wankhede Stadium) లో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో అతను కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు ఉన్నప్పటికీ, భారీ స్కోర్ చేయలేకపోయాడు.

సంజూ శాంసన్ సూచన పట్టించుకోని అభిషేక్..

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యరీ బ్రూక్ (Harry Brook) స్పిన్ బౌలర్ విల్ జాక్స్ (Will Jacks) ను బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. స్పిన్ బౌలింగ్‌పై అభిషేక్ శర్మ బలహీనత ఉన్నందున ఈ వ్యూహాన్ని ఉపయోగించారు.

ఆ ఓవర్‌లో అభిషేక్ రెండు బౌండరీలు కొట్టాడు. నాలుగో బంతి తర్వాత సంజూ శాంసన్ (Sanju Samson) అతనికి దగ్గరగా వచ్చి జాగ్రత్తగా ఆడాలని, గ్రౌండ్ షాట్లు ఆడాలని సూచించాడు.

తర్వాతి బంతిని విల్ జాక్స్‌ ఫుల్ టాస్‌గా విసరడంతో అభిషేక్ ఫోర్ కొట్టాడు. కానీ సంజూ చెప్పినట్లుగా ఆడకుండా చివరి బంతిని లాఫ్ట్ చేయడానికి ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ (Phil Salt) చేతికి ఈజీ క్యాచ్ ఇచ్చాడు.

టోర్నమెంట్‌లో చెత్త గణాంకాలు..

ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన చాలా నిరాశకరంగా ఉంది. అతను 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు.

అతని సగటు 12.71 మాత్రమే. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో అతన్ని ఫైనల్‌లో జట్టులో ఉంచకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు.

అవాంఛిత రికార్డు..

ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ ఒక అవాంఛిత రికార్డు కూడా నమోదు చేశాడు.

టీ20 వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌లో కనీసం 7 ఇన్నింగ్స్‌లు ఆడిన భారత బ్యాటర్లలో అత్యల్ప సగటు అతనిదే కావడం గమనార్హం.

12.71 – అభిషేక్ శర్మ (Abhishek Sharma) (2026)

18.87 – విరాట్ కోహ్లీ (Virat Kohli) (2024)

22.16 – శివం దుబే (Shivam Dube) (2024)

స్పిన్ బౌలింగ్‌పై బలహీనత..

ఈ టోర్నమెంట్‌లో స్పిన్ బౌలింగ్‌కు ఎదురుగా అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. స్పిన్నర్లపై అతను 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు.

నాలుగు సార్లు అవుట్ అయ్యి సగటు 8.50 మాత్రమే ఉంది. ప్రత్యర్థి జట్లు అతని ఈ బలహీనతను పూర్తిగా ఉపయోగించుకుంటున్నాయి.

నాకౌట్ మ్యాచ్‌లలో కూడా ప్రభావం లేదు..

నాకౌట్ మ్యాచ్‌లలో కూడా అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. ముఖ్యమైన మ్యాచ్‌లలో అతని స్కోర్లు ఇలా ఉన్నాయి:

IPL ఫైనల్ – 2

IPL ప్లేఆఫ్స్ – 3

IPL ప్లేఆఫ్స్ – 12

ఆసియా కప్ ఫైనల్ (పాకిస్తాన్‌పై) – 5

వరల్డ్ కప్‌లో భారత్ vs పాకిస్తాన్ – 0

వరల్డ్ కప్ నాకౌట్ vs వెస్టిండీస్ – 10

వరల్డ్ కప్ సెమీఫైనల్ vs ఇంగ్లాండ్ – 9.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *