Aadhaar: మీ ఆధార్‌లో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేస్తున్నారా? భారీగా పెరగనున్న ఛార్జీలు.. అక్టోబర్‌ 1 నుంచి అమలు!

Aadhaar: మీ ఆధార్‌లో ఏవైనా వివరాలు అప్‌డేట్‌ చేస్తున్నారా? భారీగా పెరగనున్న ఛార్జీలు.. అక్టోబర్‌ 1 నుంచి అమలు!


Aadhaar Card: భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి పత్రం. ఈ పరిస్థితిలో ఆధార్‌లో ముఖ్యమైన మార్పులు చేయడానికి ఇ-సేవా కేంద్రాలను ఆశ్రయించడం తప్పనిసరి. ఇక ఆధార్ సేవలకు రుసుములు పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుండి పేరు, చిరునామా మార్పు, బయోమెట్రిక్ వివరాలను మార్చడానికి లేదా సరిచేయడానికి రుసుములు భారీగా పెరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ కలెక్షన్‌లో ఒకదాని ధర ఎంతో తెలుసా? BMW కార్లనే కొనొచ్చు!

ఆధార్ సేవలకు భారీగా పెరిగిన రుసుములు:

భారతదేశంలోని ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డు కలిగి ఉండటం తప్పనిసరి. ఎందుకంటే ఆధార్ కార్డులో వ్యక్తి పేరు, చిరునామా, వేలిముద్రలు, కనుపాపలు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. దీనిని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఆధార్ సంబంధిత సేవలను అందిస్తూనే అక్టోబర్ 1, 2025 నుండి ఆధార్ సేవలకు రుసుములను పెంచనున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఆధార్ సర్వీస్ ఫీజు పెంపు:

  • ఆధార్‌లో పేరు, చిరునామా మార్పు రుసుము రూ.50 నుంచి రూ.75కు పెంపు.
  • బయోమెట్రిక్ అప్‌డేట్ రుసుమును రూ.100 నుండి రూ.125కి పెంచనున్నారు.
  • కొత్త ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి రుసుము లేదు.
  • పైన పేర్కొన్న సమాచారం ఆధారంగా సేవా రుసుము ప్రతి సేవకు రూ. 25 పెరుగుతుంది.

2028 వరకు ఛార్జీల పెంపు అమలులో..

ఆధార్ సేవలకు ఈ రుసుము పెంపు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుందని, ఈ రుసుము విధానం సెప్టెంబర్ 30, 2028 వరకు అమలులో ఉంటుందని యూఐడీఏఐ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

ఆధార్ సేవలకు కనీస రుసుము గతంలో రూ.50 ఉండగా, ఇప్పుడు దానిని రూ.75కి పెంచారు. ఆధార్ సేవల రుసుమును గరిష్టంగా పెంచడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ధరల పెరుగుదల తక్కువగా ఉందని అధికారులు చెప్పడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Mahindra: మహీంద్రా కారుపై బంపర్‌ ఆఫర్‌.. రూ.2.56 లక్షల వరకు తగ్గింపు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *