Aadhaar Mobile Numbe Link: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) భారతదేశంలోని పౌరులకు ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. ఈ ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్యలు ఉన్నాయి. ఆధార్ కార్డులో 12 అంకెల సంఖ్య మాత్రమే కాకుండా పేరు, చిరునామా, వయస్సు, లింగం, వేలిముద్రలు, ఐరిస్ వంటి ముఖ్యమైన వివరాలు కూడా ఉంటాయి. ఈ ఆధార్ కార్డు ఒక వ్యక్తి భారతీయ పౌరుడని నిర్ధారిస్తుంది. దీని కారణంగా భారతదేశంలో ఆధార్ కార్డును వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి: Traffic Rules: మీరు డ్రైవింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే ట్రాఫిక్ చలాన్ అస్సలు వేయరు!
ఒక మొబైల్ నంబర్‌కు ఒక ఆధార్ కార్డును మాత్రమే లింక్ చేయవచ్చా?
- భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం.. ఒక మొబైల్ నంబర్‌కు బహుళ ఆధార్ కార్డులను లింక్ చేయడానికి అనుమతి ఉంది. కానీ దానిపై కొన్ని పరిమితులు ఉన్నాయి.
- ఒకే కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డులను ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ చేసుకోవచ్చు.
- ఉదాహరణకు, పిల్లలు తమ ఆధార్ కార్డులను వారి తండ్రి లేదా తల్లి మొబైల్ నంబర్‌కు లింక్ చేయవచ్చు.
- అదేవిధంగా కుటుంబ సభ్యులు ఏ కుటుంబ సభ్యుడి ఆధార్ కార్డులను ఏ మొబైల్ నంబర్‌కైనా లింక్ చేయవచ్చు.
- కుటుంబ సభ్యులు కాని స్నేహితులు సహా ఎవరి ఆధార్ కార్డులను మొబైల్ నంబర్‌కు లింక్ చేయడానికి అనుమతి లేదు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Bike Prices: గుడ్‌న్యూస్.. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ బైక్‌లపై భారీ తగ్గింపు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి