Aadhaar: ఈ ఒక్క నంబర్ సేవ్ చేస్తే చాలు.. ఆధార్ PDF మీ వాట్సాప్‌లో..

Aadhaar: ఈ ఒక్క నంబర్ సేవ్ చేస్తే చాలు.. ఆధార్ PDF మీ వాట్సాప్‌లో..


Aadhaar: ఈ ఒక్క నంబర్ సేవ్ చేస్తే చాలు.. ఆధార్ PDF మీ వాట్సాప్‌లో..

భారతీయ పౌరులు తమ ఆధార్ కార్డును ఇప్పుడు వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం వల్ల UIDAI పోర్టల్, డిజీ లాకర్ వంటి అనేక ప్లాట్ ఫామ్ లకు వెళ్ళవలసిన అవసరం లేదు. మైగవ్ హెల్ప్ డెస్క్ చాట్ బాట్ తో ఈ సేవ అనుసంధానం అయింది. ఈ సేవ పొందాలంటే మీ మొబైల్ నంబర్ ఆధార్ కు లింక్ అయి ఉండాలి. అలాగే మీ డిజీ లాకర్ ఖాతా కూడా దానికి అనుసంధానం కావాలి.

వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్ లోడ్ విధానం

నంబర్ సేవ్: MyGov హెల్ప్ డెస్క్ నంబర్ +91-9013151515 ను మీ కాంటాక్టులలో సేవ్ చేసుకోండి.

చాట్ ప్రారంభించండి: వాట్సాప్ ఓపెన్ చేసి మైగవ్ హెల్ప్ డెస్క్ కు “హాయ్” లేదా “నమస్తే” అని మెసేజ్ పంపించండి.

సేవ ఎంచుకోండి: మెనూ ఆప్షన్స్ లో డిజీ లాకర్ సేవలు ఎంచుకోవాలి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేసి మీ ఖాతాను ధృవీకరించాలి.

ఓటీపీ ధృవీకరణ: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసి ప్రమాణీకరించాలి.

ఆధార్ డౌన్ లోడ్: ధృవీకరణ పూర్తయ్యాక, పత్రాల జాబితా నుండి ఆధార్ ను ఎంచుకోవాలి. మీ ఆధార్ కార్డు PDF ఫార్మాట్ లో వాట్సాప్ లోనే వస్తుంది.

ముఖ్యమైన విషయాలు

ఈ సేవ ఉపయోగించడానికి మీ ఆధార్ డిజీ లాకర్ తో లింక్ ఉండాలి. లేకపోతే, వాట్సాప్ ఉపయోగించే ముందు డిజీ లాకర్ వెబ్ సైట్ ద్వారా వివరాలు మార్చాలి.

చాట్ బాట్ ద్వారా ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ పద్ధతి కోట్లమంది భారతీయులకు తమ ఆధార్, ఇతర పత్రాలను పొందడానికి వేగవంతమైన, సురక్షితమైన మార్గం అందిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *