మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో నవరాత్రి వేడుకల సందర్భంగా కొత్తగా పెళ్లైన 19 ఏళ్ల ఒక మహిళ తన భర్తతో కలిసి గర్బా నృత్యం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఏంటా అని చేస్తూ పాపం ఆమె గుండెపోటుతో అక్కడికక్కడే మరణించింది. వైరల్ వీడియోలో ఆ మహిళ నృత్యం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిన దృశ్యాలు చూడొచ్చు. ప్రేక్షకులు మొదట్లో ఇది ప్రదర్శనలో భాగమని భావించారు. ఆమెకు నాలుగు నెలల క్రితమే వివాహం అయింది.
ఎంతో సంతోషంగా తన భర్తతో కలిసి నృత్యం చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమె సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొత్తగా పెళ్లి అయిన ఇంట్లో ఈ విషయం తీరని దుఃఖాన్ని మిగిలించింది. ఆమె మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
#WATCH | 19-Year-Old Married Woman Suffers Heart Attack While Performing Garba In MP’s Khandwa#MadhyaPradesh #MPNews pic.twitter.com/Jvz7NQcetM
— Free Press Madhya Pradesh (@FreePressMP) September 29, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి