అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ మరోసారి యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసే నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై అమెరికా వెలుపల నిర్మించే చిత్రాలపై 100 శాతం సుంకం విధిస్తామని తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.‘ అమెరికా బయట నిర్మించి అమెరికాలో విడుదల చేయాలనుకునే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించబోతున్నాం. ఇతర దేశాలు మా సినిమా వ్యాపారాన్ని దొంగిలించాయి. చిన్న పిల్లాడి చేతిలోంచి మిఠాయిని దొంగిలించినట్లు మా వద్ద నుంచి సినిమా వ్యాపారాన్ని లాక్కున్నాయి. అని రాసుకొచ్చారు.
కాలిఫోర్నియాకు ఉన్న బలహీన, అసమర్థత గవర్నర్ వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ట్రంప్ ఆరోపించాడు. అందువల్ల, ఈ దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి, నేను యునైటెడ్ స్టేట్స్ వెలుపల నిర్మించబడే అన్ని సినిమాలపై 100% సుంకం విధిస్తున్నాను అని.. ఈ చర్యతో అమెరికా సినిమా పరిశ్రమను నేను ఆగ్రస్థానంలో నిలుపుతానని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఒకప్పుడు అమెరికన్ సినిమాలకు మారుపేరుగా ఉన్న హాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందని, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రేక్షకులను సినిమా థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం తగ్గించాయని తెలిపారు. బాక్సాఫీస్ అమ్మకాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది చెప్పుకొచ్చాడు. అయితే ఈ కొత్త సుంకాలు ఎప్పటి నుంచి? అమల్లోకి వస్తాయి. వాటని ఎలా విధిస్తారు? అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని సినీరంగ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో తెలుగు సినిమాల విడుదలపై ప్రభావం చూపుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.