టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన హీరోయిన్. నీలిరంగు కళ్లతో వెండితెరపై మాయ చేసింది. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసింది. అప్పట్లోనే గ్లామర్ బ్యూటీగా కట్టిపడేసింది. అందానికి మంచి ఆమె కళ్లకే అప్పట్లో ఎక్కువగా ఫ్యాన్స్ ఉండేవారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమె పేరు మోహిని. 1987లో ‘కూట్టుప్పుంపులుక్కల్’ చిత్రంతో తమఇళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1991లో ఈరమాన రోజావే సినిమాతో ఫేమస్ అయ్యింది. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు మాతమరే.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇక తర్వాత బాలకృష్ణతో కలిసి ఆదిత్య 369 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో ఆమె పేరు మారుమోగింది. ఆ తర్వాత డాన్సర్ సినిమాతో హిందీ సినిమాల్లోకి తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో అలరించిన ఆమె.. కొన్నాళ్లకే ఇండస్ట్రీకి దూరమయ్యింది. 2007లో చివరగా కుట్రపత్రికై సినిమలో కనిపించింది. 21 ఏళ్ల వయసులోనే ఏంబీఏ గ్రాడ్యుయేట్ భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఆ తర్వాత తనకు నిద్రలో తనను చంపుతున్నట్లు కలలు వచ్చాయని తెలిపింది. జీవితంలో ఏ కష్టాలు లేకపోయినప్పటికీ తాను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఆ తర్వాత ఒక జ్యోతిష్యుడి కలిస్తే తనపై చేతబడి జరిగిందని చెప్పాడని.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువగా నిద్రమాత్రలు వేసుకున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో తెగ వైరలయ్యాయి.

Mohini New
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..