భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. వారి వివాహం కేవలం రెండు నెలలకే విడాకులకు దారితీసిందనే విషయాన్ని ఆమె వెల్లడించింది. దీంతో వీరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
“రెండు నెలలకే మోసం చేశాడు”
‘రైజ్ అండ్ ఫాల్’ (Rise and Fall) అనే రియాలిటీ షోలో పాల్గొంటున్న ధనశ్రీ, తన వైవాహిక జీవితం గురించి ఓ ప్రశ్నకు జవాబిస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది. సహ-పోటీదారు కుబ్రా సైత్ (Kubbra Sait) “మీ సంబంధం ఇక పనిచేయదని, ఇది తప్పు అని ఎప్పుడు గ్రహించారు?” అని ధనశ్రీని అడిగాడు.
ఇవి కూడా చదవండి
దీనికి ధనశ్రీ వర్మ బదులిస్తూ, “మొదటి సంవత్సరంలోనే… నిజానికి, నేను అతన్ని (చాహల్‌ను) రెండో నెలలోనే పట్టుకున్నాను” అని షాకింగ్‌గా సమాధానం ఇచ్చింది. ఈ మాట వినగానే కుబ్రా సైత్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విడాకులు, భరణంపై కూడా క్లారిటీ..
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 2020 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వారి విడాకుల గురించి వచ్చిన భరణం (alimony) ఆరోపణలపైనా ధనశ్రీ స్పందించింది.
“అధికారికంగా ఇది జరిగి దాదాపు సంవత్సరం అవుతోంది. ఇది పరస్పర అంగీకారంతో జరిగింది, అందుకే భరణం గురించి ప్రజలు మాట్లాడటం తప్పు. నేను ఏమీ చెప్పడం లేదు కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?” అని ఆమె ప్రశ్నించింది. తన తల్లిదండ్రులు తనకు నేర్పింది ఏమిటంటే, కేవలం తాను పట్టించుకునే వారికి మాత్రమే వివరణ ఇవ్వాలని, మిగతా వారికి టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని ధనశ్రీ తెలిపింది.
కాగా, గతంలో కూడా ధనశ్రీ వర్మ తన వైవాహిక జీవితంలోని కష్టాల గురించి మాట్లాడుతూ, “నేను ఒక విషయాన్ని బయటపెడితే, ఈ షో కూడా మీకు చిన్నదిగా కనిపిస్తుంది” అని చెప్పి పరోక్షంగా చాహల్‌పై ఆరోపణలు చేసింది. అయితే, ఈ మొత్తం వివాదంపై యుజ్వేంద్ర చాహల్ ఇంకా నేరుగా స్పందించలేదు. ధనశ్రీ చేసిన ఈ తాజా ప్రకటన మాజీ దంపతుల మధ్య మరోసారి చర్చకు దారితీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..