బాలీవుడ్ లో దెయ్యాల సినిమాలకు కేరాఫ్ గా మ్యాడాక్ సంస్థ

బాలీవుడ్ లో దెయ్యాల సినిమాలకు కేరాఫ్ గా మ్యాడాక్ సంస్థ


ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు.. మార్కెట్‌లో ఏం నడుస్తుందో చూసి అలాంటి సినిమాలు తీసుకుంటూ పోతే మంచిది అంటున్నారు బాలీవుడ్ మేకర్స్. దెయ్యాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వరసగా ఆ కథలే చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. భూల్ భులయ్యా 3, స్త్రీ 2 రొటీన్‌గానే ఉన్నా కాసులు కురిపించడానికి ట్రెండే కారణం. తాజాగా ఈ లిస్టులోకి థామా వచ్చేస్తుంది. బాలీవుడ్‌లో దెయ్యాలను దత్తత తీసుకున్న ప్రొడక్షన్ కంపెనీ ఒకటుంది.. అందులోనే కొన్నేళ్ళుగా స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 లాంటి సినిమాలు వచ్చాయి.. అదే మ్యాడాక్ నిర్మాణ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఒకేసారి 8 హారర్ సినిమాలను రిలీజ్ డేట్స్‌తో సహా ప్రకటించింది. ఇందులోంచి థామా ట్రైలర్ విడుదలైందిప్పుడు. రష్మిక ఇందులో హీరోయిన్. అక్టోబర్ 21న దివాళి కానుకగా విడుదల కానుంది థామా. కథేంటో ట్రైలర్‌లోనే చెప్పారు.. వేల సంవత్సరాల నుంచి వచ్చిన డ్రాకులా రష్మిక మందన్న. మెల్లగా మనుషుల్లో కలిసిపోతుంది.. ఆమెతో హీరో ప్రేమలో పడతాడు.. ఆ దెబ్బతో హీరో కూడా డ్రాకులా అయిపోతాడు.. ఇదే సమయంలో భూమిని నాశనం చేయడానికి ఓ రాక్షసుడు వస్తాడు.. ఇదే సింపుల్‌గా థామా కథ. సికిందర్ డిజాస్టర్‌తో రేసులో వెనకబడిన రష్మికకు థామా విజయం కీలకంగా మారింది. ఇక మ్యాడాక్ నుంచి శక్తి షాలిని డిసెంబర్ 31న రానుంది. 2026లో వరుణ్ ధావన్ భేడియా 2, చాముండా సినిమాలు రానున్నాయి. 2027లో స్త్రీ 3, మహా ముంజ్యా సిద్ధమవుతున్నాయి. 2028లో పెహ్లా మహాయుద్ధ్, దూస్రా మహాయుధ్ వస్తాయి. మొత్తానికి మ్యాడాక్ అంతా ఇప్పుడు దెయ్యాల కోటగా మారిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియాలోనూ రప్ఫాడిస్తున్న జేమ్స్ కామెరూన్

పక్కా ప్లానింగ్‌తో నేచురల్‌ స్టార్‌ నాని.. బొమ్మ దద్దరిల్లి పోతుంది అంతే

స్టార్ హీరోయిన్స్‌ చూపు కూడా నార్త్ వైపే.. కారణం అదేనా

తెర ముందే కాదు.. తెర వెనుక కూడా మా సత్తా చాటుతా అంటున్న సామ్‌

డిఫరెంట్ లుక్స్ తో అభిమానుల అంచనాలు పెంచేస్తున్న స్టార్‌ హీరోలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *