వీళ్లు మనుషులేనా ?? ముగ్గురు యువతుల దారుణ హత్య.. లైవ్ స్ట్రీమింగ్‌ !

వీళ్లు మనుషులేనా ??  ముగ్గురు యువతుల దారుణ హత్య.. లైవ్ స్ట్రీమింగ్‌ !


బాధిత కుటుంబసభ్యులతో కలిసి పార్లమెంట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బ్యూనస్ ఎయిర్స్ శివారు ప్రాంతానికి చెందిన మోరెనా వెర్డి , బ్రెండా డెల్ కాస్టిల్లో, 15 ఏళ్ళ లారా గుటియెర్రెజ్ సెప్టెంబర్‌ 19న అదృశ్యమయ్యారు. ఐదు రోజుల తర్వాత ఒక ఇంటి పెరట్లో పాతిపెట్టిన వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ముఠాతో ఉన్న విభేదాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పార్టీ పేరుతో యువతులను వ్యాన్‌లోకి ఎక్కించుకుని, ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరు హత్యను ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ అకౌంట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు తెలిసి అంతా షాకయ్యారు. సుమారు 45 మంది ఈ లైవ్‌ను చూసినట్లు అధికారులు తెలిపారు. “నా దగ్గర డ్రగ్స్ దొంగిలిస్తే ఇలాగే జరుగుతుంది” అని 20 ఏళ్ల ఒక ముఠా నాయకుడు వీడియోలో హెచ్చరించినట్లు సమాచారం. నిందితులు బాధితుల వేళ్లను నరికి, గోళ్లను పీకి, తీవ్రంగా కొట్టి ఊపిరాడకుండా చేసి చంపారని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఘటనపై జాతీయ భద్రతా మంత్రి పాట్రిసియా బుల్రిచ్ మాట్లాడుతూ ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ప్రకటించారు. ఐదో నిందితుడిని బొలీవియా సరిహద్దు నగరమైన విల్లాజోన్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ హత్యలకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న 20 ఏళ్ల పెరూ దేశస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, ఈ లైవ్ స్ట్రీమింగ్ తమ ప్లాట్‌ఫామ్‌పై జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ ‘మెటా’ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దారుణమైన నేరంపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు సహకరిస్తున్నామని మెటా ప్రతినిధి చెప్పారు. నిరసనలో పాల్గొన్న బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. “జంతువులనూ ఇంత క్రూరంగా చంపరు. మాకు న్యాయం జరగాలి” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మబాబోయ్‌.. ఒకే కిడ్నీలో 1820 రాళ్లు..

టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ నజరానా

ఆసియాకప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన టీమిండియా

ఆసియా కప్ ఫైనల్ లో సత్తా చూపిన తెలుగోడు తిలక్ వర్మ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *