ఎందుకంటే టాలీవుడ్ నుంచే ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నారు మన హీరోలు. హీరోయిన్లు కూడా అంతే. ఇప్పటికే సమంత, రష్మిక సహా చాలా మంది బ్యూటీస్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా శ్రీలీల, సాయి పల్లవి సైతం నార్త్‌లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర, ఉస్తాద్ సినిమాల్లో నటిస్తున్నారు. వీటి తర్వాత ఈమె కొత్త సినిమాలు సైన్ చేయలేదు. తమిళంలో శివకార్తికేయన్‌తో పరాశక్తి సినిమా చేస్తున్నారు. హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాతో డెబ్యూ చేయబోతున్నారు శ్రీలీల. దాంతో పాటు మరో రెండు సినిమాలకు ఈమె సైన్ చేసారనే వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఆషికి ఫ్రాంచైజీలో కార్తిక్ ఆర్యన్ సినిమా వస్తుందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజానికి ఈ సినిమాను 2025లోనే విడుదలకు ప్లాన్ చేసినా.. సయారా కథతో పోలికలు ఉండటంతో కథలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే 2026కి ఈ సినిమా వాయిదా పడింది. అలాగే ఈ ఏడాది ఉండాల్సిన శ్రీలీల నార్త్ డెబ్యూ నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ అయింది. సాయి పల్లవి కూడా పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ చేసారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలేం చేయట్లేదు ఈమె. రామాయణలో సీతగా నటిస్తూనే.. అమీర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు రెండు భాగాలుగా రానున్న రామాయణ.. 2026, 2027 దివాళికి విడుదల కానున్నాయి. మరి ఈ ఇద్దరూ అక్కడ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మబాబోయ్.. ఒకే కిడ్నీలో 1820 రాళ్లు..
టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ నజరానా
ఆసియాకప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన టీమిండియా
ఆసియా కప్ ఫైనల్ లో సత్తా చూపిన తెలుగోడు తిలక్ వర్మ