ఒకప్పుడు ఆమె బుల్లితెరపై సైడ్ ఆర్టిస్ట్.. కొన్ని సీరియల్స్ లో సైడ్ ఆర్టిస్టుగా కనిపించింది. కానీ అందం, అభినయంతో స్మాల్ స్క్రీన్ పై గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. హిందీలో వరుసగా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో చిన్న చిత్రాలలో సహాయ పాత్రలు పోషించినప్పటికీ, ఆమె ప్రతిభ.. ఆత్మ విశ్వాసం ఆమెను ఇప్పుడు టాప్ హీరోయిన్ గా మార్చింది. ఇప్పుడు ఆమె భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. మృణాల్ ఠాకూర్. పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఇవి కూడా చదవండి
బుల్లితెరపై కుంకుమ్ భాగ్య అనే సీరియల్లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించింది. ఈ సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆమె.. 2014లో మరాఠీ చిత్రం “విటి తండు” తో వెండితెరకు అరంగేట్రం చేశారు. తరువాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నించిన మృణాల్, “లవ్ సోనియా”, “సూపర్ 30” (హృతిక్ రోషన్ తో), “జెర్సీ” (షాహిద్ కపూర్ తో) వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించడం ద్వారా పాపులర్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
2022లో విడుదలైన సీతారామం సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీతో దక్షిణాదిలో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా మృణాల్ కెరీర్ మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది. కానీ ఈ మూడు చిత్రాల తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం తెలుగులో డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది. ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. అలాగే ఆమె ఆస్తులు రూ.40 కోట్లు ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?