ఇండియాలోనూ రప్ఫాడిస్తున్న జేమ్స్ కామెరూన్

ఇండియాలోనూ రప్ఫాడిస్తున్న జేమ్స్ కామెరూన్


ఇంతకీ ఈ చిత్ర బిజినెస్ రేంజ్ ఎంతో తెలుసా..? కొందరు దర్శకులకు ఇండస్ట్రీతోనే కాదు.. దేశంతో కూడా పనిలేదు. అందులో జేమ్స్ కామెరూన్ కూడా ఒకరు. పేరుకు హాలీవుడ్ అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. కామెరూన్ సినిమా అంటే మన దగ్గర కూడా కాసుల గలగలే. మూడేళ్ళ కింద వచ్చిన అవతార్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దాంతో కామెరూన్ సినిమాలపై అంచనాలు ఎప్పుడూ తగ్గవని మళ్లీ నిరూపించింది అవతార్ 2. తీసేది హాలీవుడ్ బొమ్మే అయినా.. ఇండియాలోనూ రప్ఫాడిస్తుంటాయి జేమ్స్ కామెరూన్ సినిమాలు. తాజాగా ఈయన నుంచి అవతార్ 3 రాబోతుంది. పంచ భూతాలే అవతార్ కథకు స్పూర్థి అని అర్థమవుతుంది. మొదటి భాగాన్ని నేల మీద.. రెండో భాగాన్ని నీళ్ళలో తీసారు జేమ్స్. మూడో భాగం ఫైర్ నేపథ్యంలో ఉంటుంది. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ ఆష్ టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మెట్కైనా అనే రెండు కొత్త తెగలను పరిచయం చేస్తున్నారిందులో. పండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం. 2009లోనే 13500 కోట్లు వసూలు చేసింది అవతార్.. అలాగే 2022లో 12500 కోట్లు వసూలు చేసింది అవతార్ 2. తాజాగా పార్ట్ 3 బిజినెస్ నెక్ట్స్ లెవల్‌లో జరుగుతుంది. దీని టార్గెట్ 20 వేల కోట్లు. ఇప్పుడున్న డాలర్ వ్యాల్యూకు ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. ఇండియాలోనూ 250 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. మొత్తానికి ఈ డిసెంబర్ 19న పెద్ద యుద్ధమే జరగబోతుంది బాక్సాఫీస్ దగ్గర.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్కా ప్లానింగ్‌తో నేచురల్‌ స్టార్‌ నాని.. బొమ్మ దద్దరిల్లి పోతుంది అంతే

స్టార్ హీరోయిన్స్‌ చూపు కూడా నార్త్ వైపే.. కారణం అదేనా

తెర ముందే కాదు.. తెర వెనుక కూడా మా సత్తా చాటుతా అంటున్న సామ్‌

డిఫరెంట్ లుక్స్ తో అభిమానుల అంచనాలు పెంచేస్తున్న స్టార్‌ హీరోలు

ఓజీ-2 అప్‌డేట్‌ ఇచ్చిన సుజీత్.. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *