ఆటో క్లీన్ చేస్తుండగా.. వెనకసీట్‌లో కనిపించిన పర్స్‌.. డ్రైవర్‌ ఏం చేశాడంటే..

ఆటో క్లీన్ చేస్తుండగా.. వెనకసీట్‌లో కనిపించిన పర్స్‌.. డ్రైవర్‌ ఏం చేశాడంటే..


కస్టమర్‌ తన ఆటోలో మర్చిపోయిన డబ్బును తిరిగి అతినికి చేరేలా చేసి అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు ఓ ఆటోడ్రైవర్‌. మానవుల్లో ఇంకా నిజాయితీ ఉందని నిరూపించే ఈ ఘటన మెదక్ జిల్లాలోని ఝరాసంగం అనే మండలంలో చోటుచేసుకుంది.స్థానింకగా ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్న రాజ్‌కుమార్‌ అనే వ్యక్తికి.. తన ఆటో క్లిన్ చేస్తుండగా.. వెనక సీటులో రూ.8వేల నగదు కనిపించింది. అయితే అందరిలా ఆ డబ్బును గమ్మున తీసుకొని జేబులో పెట్టుకోకుండా.. రాజ్‌కుమార్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును అప్పగించారు. ఈ డబ్బు ఎవరిదో దర్యాప్తు చేసి వాళ్ల అప్పగించాలని పోలీసులను కోరడంతో వారు దర్యాప్తు జరిపి యజమానికి డబ్బును అందజేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ రోజూ ఆటోలో ప్యాసింజర్స్‌ను ఝరాసంగం నుంచి జహీరాబాద్‌కు రావాణా చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన సంగమేష్ అనే వ్యక్తి దసరా సరుకుల కోసం రాజ్‌కుమార్ ఆటోలో జహీరాబాద్ వెళ్లి వచ్చాడు ఆ సమయంలో సంగమేష్ వద్ద ఉన్న నగదు ఆటోలోని వెనక సీట్‌లో జారిపడిపోయింది. అది గమనించకుండా సంగమేష్‌ అలానే ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజూ ఉదయం రాజ్‌కుమార్ ఆటో క్లీన్ చేస్తుండగా అతనికి ఆ డబ్బు కనిపించింది. దీంతో అతను వెంటనే ఆ డబ్బును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు.

రాజ్‌కుమార్‌ నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి ఆ నగదు సంగమేష్‌ దని గుర్తించారు. దీంతో సోమవారం అతనికి సమాచారం ఇచ్చి పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి డబ్బు తిరిగి అందజేశారు. అందరిలా డబ్బుకు ఆశపడకుండా.. నిజాయితీగా తీసుకొచ్చి పోలీసులకు అందించిన రాజ్‌కుమార్‌ను పోలీసులు అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *