తెలంగాణ ప్రభుత్వం సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సీనియర్ సినీ కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి లేబర్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, కార్మిక శాఖ అదనపు కమిషనర్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కమిటీలో ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో పాటు ఫిల్మ్ చాంబర్ ఫెడరేషన్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి చెరి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాత యార్లగడ్డ సుప్రియ, ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, కార్యదర్శి అమ్మిరాజులకు ఈ కమిటీలో చోటు లభించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెంచరీ స్టార్స్… సౌత్‌లో క్రేజీ కెప్టెన్స్
బాహుబలి కథ నుంచి క్యూ కడుతున్న ప్రీక్వెల్స్
రామ్ చరణ్ 18 ఏళ్ల ప్రస్థానం.. పెద్ది అప్డేట్తో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం
గ్లామర్ టర్న్.. నార్త్ డెబ్యూకి నయా ఫార్ములా
రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా