భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13వ ఓవర్లో సంజు శాంసన్ (24 పరుగులు) అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కీలక సమయంలో సంజు వికెట్ పడగానే, అబ్రార్ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అయితే, ఈ సంబరం హద్దులు దాటింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ఒక సంఘటనతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు పాక్ బౌలర్. భారత బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ వికెట్ పడగానే, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ చేసిన ఓవర్ యాక్షన్ భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైంది.
తల ఊపి డగౌట్ వైపు సంకేతాలు చేస్తూ, పెవిలియన్ వైపు వెళ్తున్న సంజు శాంసన్‌కు అబ్రార్ అహ్మద్ ‘ఇక వెళ్ళిపో’ అన్నట్టుగా వెటకారంగా సైగ చేశాడు. ఈ ‘గో అవే’ సంకేతం సంజు శాంసన్‌ను ఉద్దేశించి చేసినట్టు స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో శాంసన్ ప్రశాంతంగా వెళ్ళిపోయినా, ఈ దృశ్యం టీమ్ ఇండియా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఇవి కూడా చదవండి
ఫ్యాన్స్ రియాక్షన్… సోషల్ మీడియాలో నిరసన..
ABRAR AHMED GETS IMPORTANT BREAKTHROUGH FOR PAKISTAN..!! 🔥
– Sanju Samson dismissed for 24 in 21 balls.#AsiaCup2025 #AsiaCupFinal #INDvPAK #INDvPAK pic.twitter.com/co6B0bFoq3
— 𝐅 𝐀 𝐈 𝐙 𝐀 𝐍 💫🇵🇰 (@Faizanali_152) September 28, 2025
ఒక ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్లో, అది కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో, ప్రత్యర్థి ఆటగాడి వికెట్ తీసినప్పుడు ఇలా అగౌరవంగా ప్రవర్తించడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడాస్ఫూర్తిని గౌరవించాలని, గెలుపోటములు సహజమే అయినా, వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం తగదని నెటిజన్లు అబ్రార్ అహ్మద్‌ను దుమ్మెత్తిపోశారు. ‘అతిగా వ్యవహరించొద్దు’, ‘గేమ్ స్పిరిట్‌ను చూపించు’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
గెలుపుతో భారత ఆటగాళ్ల సరదా రివెంజ్..!
Arshdeep Singh New Instagram Reel 😂
– Bro roasted that fraud bowler pic.twitter.com/Sso722oL72
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) September 28, 2025
అయితే, భారత్ ఈ ఫైనల్‌ను అద్భుతంగా ఛేదించి, రింకూ సింగ్ విజయవంతమైన బౌండరీతో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ గెలిచిన తర్వాత, భారత ఆటగాళ్లు తమదైన స్టైల్లో అబ్రార్ అహ్మద్‌కి ‘రిప్లై’ ఇచ్చారు.
అర్ష్‌దీప్ సింగ్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా సహా పలువురు భారత ఆటగాళ్లు కలిసి, అబ్రార్ అహ్మద్ చేసిన ఆ ‘తల ఊపుతూ వెళ్ళిపో’ అనే సంకేతాన్ని సరదాగా అనుకరించారు. ఈ దృశ్యాన్ని సంజు శాంసన్ చిరునవ్వుతో తిలకించడం అభిమానులకు మరింత కిక్కిచ్చింది. అర్ష్‌దీప్ సింగ్ ఈ వీడియోను “నో కాంటెక్స్ట్” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది తక్షణమే వైరల్‌గా మారింది.
పాక్ స్పిన్నర్ అతిని, భారత యువ ఆటగాళ్లు తమ విజయం తర్వాత సరదాగా ఆటపట్టించడం పట్ల టీమ్ ఇండియా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా మైదానంలో ఎదురైన అగౌరవానికి, సరదాగా, స్టైలిష్‌గా బదులిచ్చారని అభిమానులు ప్రశంసించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..