ఈ రోజుల్లో ఎక్కువ కమర్షియల్ చిత్రాలే వస్తున్నాయి. ఎలివేషన్స్ మీదే మేకర్స్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. కథ మీద ఫోకస్ చాలా తక్కువ అయపోయింది. ఇటీవల వచ్చిన కూలీని పక్కనబెడితే.. తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ మంచి కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా అతను తీసిన ఖైదీ సినిమా జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. హీరో కార్తీ యాక్టింగ్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఇందులో ఢిల్లీ అనే పాత్ర చేశాడు కార్తీ. అయితే సినిమాలో ఢిల్లీ కుమార్తె ఆముదగా నటించిన పాప మీకు గుర్తుందా..? ఈ రోల్ చేసింది బేబీ మోనికా. సినిమాకు ఆయువుపట్టు ఆ పాప పాత్రే. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా మారిపోయిందో చూస్తే వామ్మె అంటారు.
ఖైదీ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఒక హత్య కేసులో ఢిల్లీ జైలుకు వెళ్తాడు. అతని భార్య చనిపోతుంది. తనకు ఉన్న ఏకైక కుమార్తె.. తను ఓ కేరింగ్ హోమ్‌లో ఉంటూ చదువుకుంటుంది. తన నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ సమయంలో జైలు నుంచి రిలీజయ్యి.. తన కుమార్తెను చూసేందుకు బయల్దేరిన ఢిల్లీకి మధ్యలో ఆటంకాలు ఎదురువుతాయి. వాటిని దాటి కూతురు దగ్గరికి వెళ్లిన.. తన కుమార్తెతో కలిసి దూరంగా వెళ్లిపోతాడు. అక్కడితోనే సినిమా కంప్లీట్ అవుతుంది. ఈ సినిమా పార్ట్ 2పై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ ఖైదీ సినిమా మొత్తం తండ్రీకుమార్తెల కథ చుట్టూనే నడుస్తూ ఉంటుంది. ఇంత హిట్ చిత్రం.. అద్భుతమైన రోల్ చేసిన బేబీ మోనికా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు స్టన్ అవ్వాల్సిందే.
అముదా పాత్ర చేసిన బేబీ మోనికా చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా చిత్రాల్లో నటించింది. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఖైదీ మూవీ కాకుండా… ఎరుంబు, ది ప్రీస్ట్, ఖాదర్ భాషా వంటి మంచి సినిమాల్లో నటించింది. ది ప్రీస్ట్ మూవీకి మాలీవుడ్ ఫ్లిక్స్ నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును సైతం అందుకుంది. తన లేటెస్ట్ ట్రెండీ లుక్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి…