ఏపీ, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలను తగ్గించింది. బాల్కనీ టికెట్ ధరను రూ.150, ఫస్ట్ క్లాస్‌ను రూ.105గా నిర్ణయించింది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజా నిర్ణయంతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా విడుదల సమయంలోనూ సాధారణ టికెట్ ధరలనే అమలు చేస్తేనే రూ.140 కోట్లు వసూలు కాగా, ఇప్పుడు తగ్గించిన ధరలతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే అవకాశం ఉంది. పండుగ వేళ థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించడానికి ‘వైబ్’ సాంగ్‌ను జత చేస్తుంది. ‘‘చాట్‌బాస్టర్ ‘వైబ్’ సాంగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ ప్రదర్శితమవుతున్న అన్ని షోలలోనూ యాడ్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. గౌర హరి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ ఆలపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు
ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిదాయక నిర్ణయం
రన్నరప్ చెక్ ను స్వీకరించి విసిరేసిన పాక్ కెప్టెన్
అమ్మబాబోయ్.. ఒకే కిడ్నీలో 1820 రాళ్లు..