YVS Chowdary: డైరెక్టర్ వైవీఎస్ చౌదరి భార్య ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా? క్యాస్ట్‌లు వేరైనా….

YVS Chowdary:  డైరెక్టర్ వైవీఎస్ చౌదరి భార్య ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా? క్యాస్ట్‌లు వేరైనా….


సీనియర్ ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించే వారిలో టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఒకరు. ఆ అభిమానంతోనే నందమూరి ఫ్యామిలీతో ఎక్కువగా సినిమాలు చేశారు వైవీఎస్. శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి సినిమాతో డైరెక్టర్‌ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారాయన. సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, రేయ్‌ సినిమాలతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే బాలకృష్ణతో చేసిన ఒక్క మగాడు, మంచు విష్ణుతో తెరకెక్కించిన సలీం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైపోయారు వైవీఎస్. 2015 రేయ్ తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. అయితే సుమారు 9 ఏళ్ల తర్వాత గతేడాది ఒక సినిమాను అనౌన్స్ చేశారు వైవీఎస్ చౌదరి. దివంగత నందమూరి హరికృష్ణ మనవడు.. నందమూరి జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావును ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఈ సినిమాకు వైవీఎస్ చౌదరి సతీమని గీత నిర్మాతగా వ్యవహరించనుంది. ఎన్టీఆర్ సినిమా లాంఛింగ్ ఈవెంట్ లోనూ ఆమె కనిపించింది.

ఇవి కూడా చదవండి

కాగా వైవిఎస్ చౌదరి భార్య గీత గతంలో పలు సినిమాల్లో నటించిందనే విషయం చాలా మందికి తెలియదు. నాగార్జున సూపర్ హిట్ సినిమా.. నిన్నే పెళ్లాడతాలో నాగార్జున చెల్లెలి పాత్రలో గీత నటించింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

నిన్నే పెళ్లాడతా, సింధూరం సినిమాల్లో వైవీఎస్ చౌదరి సతీమణి గీత..

Yvs Chowdary Wife Geetha

Yvs Chowdary Wife Geetha

కాగా నిన్నే పెళ్లాడతా సినిమాకు వైవిఎస్ చౌదరి డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో వర్క్ చేశారు. ఆ సమయంలో గీతతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా చిగురించింది. అయితే మొదట్లో క్యాస్ట్‌లు వేరవడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయితే పట్టు బట్టి మరీ పెద్దలను ఒప్పించిన తర్వాతే పెళ్లిపీటలెక్కారు వైవీఎస్- గీత.

కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ఈవెంట్ లో వైవీఎస్ చౌదరి, గీత

ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైపోయిన గీత.. ఇప్పుడు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో నిర్మాతగా మారనుంది. న్యూ ట్యాలెంట్ రోర్స్@(NTR@) అనే పేరు మీద కొత్త ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది గీత.

ఎన్టీఆర్ సినిమా లాంఛింగ్ ఈవెంట్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *