ప్రస్తుత జనరేషన్ లో పుట్టక ముందే.. అమ్మ కడుపులో ఉన్నప్పుడే అన్నీ నేర్చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా, నెట్, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా నేటి సమాజంలో ఏమి జరుగుతుందనే విషయంలో అప్ డేట్ గా ఉంటున్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది అమాయకత్వంతో కనిపిస్తూ.. అయ్యో అనిపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతలో నివసించే బామ్మ, తాతలు అయితే మరీ అమాయకులు. కళ్ళు మూసుకుని ఎవరేమి చెప్పినా నమ్ముతారు. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో. ఈ వీడియో ఒక పల్లెటూరి బామ్మ అమాయకత్వానికి నిదర్శనం అని చెప్పవచ్చు. అవును కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బస్సులలో స్త్రీలకూ ప్రయాణం ఉచితం అన్న సంగతి తెలిసిందే. అయితే రైలులో ఒక వృద్ధురాలు తన ఆధార్ కార్డును చూపించి టికెట్ కలెక్టర్‌ను టికెట్ అడిగింది. ఈ బామ్మ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సికందర్ అనే X ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక అమ్మమ్మ రైలులో ప్రయాణిస్తున్నట్లు చూడవచ్చు. అయితే ఆ బామ్మ బస్సులో వలెనే.. రైలులో కూడా తన ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా ప్రయాణించవచ్చని అనుకున్నట్లు ఉంది కాబోలు.. తన దగ్గరకు వచ్చిన TCకి టికెట్ కి బదులుగా తన ఆధార్ కార్డును చూపించి టికెట్ అడుగుతుంది. అతనికి మొదట ఏమీ అర్థం కాలేదు.. ‘ఏంటిది?’ అని బామ్మని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న మరో మహిళ బస్సులో ఆధార్ చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తున్నారు కదా.. అదే విధంగా ట్రైన్ లో ఇస్తారు అనుకున్నట్లు ఉంది అని చెప్పింది. దీంతో ఆ బామ్మ అమాయకత్వాన్ని చూసిన TC ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ.. చేతిలో ఆధార్ కార్డుని ఆ బామ్మ చేతిలో తిరిగి పెట్టేసి.. ట్రైన్ లో ఆధార చూపిస్తే టికెట్ ఇవ్వరు. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అని చెప్పినట్లు ఉన్నాడు.
ರೈಲಿನಲ್ಲಿ ಉಚಿತ ಪ್ರಯಾಣಕ್ಕಾಗಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ತೋರಿಸಿದ ಅಜ್ಜಿ…
ಪಾಪ ಆ ಮುಗ್ದ ಮನಸ್ಸಿಗೇನು ಗೊತ್ತು ರೈಲ್ವೆ ಇಲಾಖೆಯನ್ನು ಆಳುವ ಮೋದಿ ಒಬ್ಬ ಬಡವರ ವಿರೋಧಿ ಎಂದು..ಈ ಅಜ್ಜಿಯ ಕನಸು ನನಸಾಗಲು ನಮ್ಮ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅಥವಾ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಪ್ರಧಾನಿಯಾಗಬೇಕು.@siddaramaiah pic.twitter.com/5SOrbD2aqr
— Sikandar – ಸಿಕಂದರ್. (@SikkuTweets) September 26, 2025
ఈ సంఘటన అక్కడే ఉన్న మరో ప్రయాణీకుడు వీడియో తీశాడు. సికందర్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ బామ్మ కల నెరవేరాలంటే రాహుల్ గాంధీ కానీ, సిద్ధరామయ్య కానీ, ప్రధాని కావాల్సిందే’ అని క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు. ఒకరు ఇది స్క్రిప్ట్ లాగా ఉందని వ్యాఖ్యానించాడు. మరొకరు “మన గ్రామ ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి, వారికి ఏమీ తెలియదు” అని అన్నాడు. అయితే ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందో తెలియలేదు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..