
మనదేశంలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ పరంగా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఇవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరి మీదా ప్రభావం చూపుతాయి. మరి వచ్చే నెల అంటే అక్టోబర్ 1, 2025 నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూసేద్దామా?
1. నేషనల్ పెన్షన్ సిస్టమ్
అక్టోబర్ 1 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో ఒక మార్పు రానుంది. ఇకపై ఎన్ పీఎస్ చందాదారులంతా ఈక్విటీలలో వంద శాతం వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రభుత్వేతర ఎన్‌పీఎస్ చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతకు ముందు నాన్ గవర్నమెంట్ పెన్షన్ హోల్డర్స్ కు ఈక్విటీ పెట్టుబడుల్లో లిమిట్ 75 శాతంగా ఉండేది.
2. వంట గ్యాస్ ధరలు
అక్టోబర్ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మారనున్నాయి. ప్రతినెలా 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను మారుస్తుంటాయి. దానికి అనుగుణంగా ఒకటో తారీఖు నుంచి ధరల్లో మార్పులొస్తాయి.
3. యూపీఐ లావాదేవీలు
అక్టోబర్ 1 నుంచి యూపీఐ పేమెంట్స్ లో పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ ను బ్యాన్ చేయనున్నారు. అంటే యూపీఐ ఐడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి పేమెంట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. వినియోగదారుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని, సైబర్ నేరాలను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్ పీసీఐ చెప్తోంది. స్కాన్ లేదా నెంబర్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా ఐడీ ద్వారా బ్యాంక్ అకౌంట్ కు డబ్బు పంపే సదుపాయాన్ని తొలగించబోతున్నట్టు సమాచారం.
4. రైల్వే టికెట్ బుకింగ్
అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్స్ లో ఓ కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇకపై ఆధార్ వెరిఫికేషన్ ఉన్నవారు మాత్రమే ముందుగా రిజర్వేషన్ చేసుకోగలరు. అంటే బుకింగ్ మొదలైన మొదటి 15 నిమిషాల్లో టికెట్లను బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యి ఉండాలి.
5. ఆన్‌లైన్ గేమింగ్
ఆన్‌లైన్ గేమింగ్ లో జరిగే మోసాలను నివారించేలా అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ఒకటో తారీఖు నుంచి అమలులోకి రానుంది. ఇకపై ఆన్ లైన్ లో డబ్బు పెట్టి ఆడే గేమ్స్ అన్నీ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి