పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. హీరోయిన్ కూడా ఎంతో అందంగా కనిపించింది. ఇక థమన్ బీజీఎం సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీంతో పవన్ అభిమానులతో పాటు సామాన్య జనాలు కూడా ఓజీ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కలెక్షన్ల పరంగా చూస్తే.. మొదటి రోజే 154 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది ఓజీ. ఇక తాజాగా మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఓజీ సినిమా నాలుగు రోజుల్లో 252 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు మూవీకి సంబంధించి ఒక సూపర్బ్ పోస్టర్ ను విడుదల చేసింది.
పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఓజీ మూవీ ఓవర్సీస్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. అమెరికాలో ఇప్పటికే 5 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంటే దాదాపు 40 కోట్ల కలెక్షన్స్ కేవలం అమెరికా నుంచే వచ్చాయన్నమాట. ఇక పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఓజీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్, కిక్ శ్యామ్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.
ఇవి కూడా చదవండి
డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ ట్వీట్..
When cyclone strikes…
Bow down to the tide…
When #OG comes you run and hide!!252Cr+ Worldwide Gross in 4 days 🔥#BoxOfficeDestructorOG #TheyCallHimOG pic.twitter.com/HGo96vPES4
— DVV Entertainment (@DVVMovies) September 29, 2025
OG on RAMPAGE 🎯⁰A BLOODBATH of fire, frenzy & full houses ❤️🔥#TheyCallHimOG #OG #BoxOfficeDestructorOG pic.twitter.com/MAFyRswMRj
— DVV Entertainment (@DVVMovies) September 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.