ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష

ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష


సోషల్ మీడియా పట్ల ఆసక్తి పెరిగింది. సొంతంగా కంటెంట్ క్రియేషన్ నేర్చుకున్నాడు. ఒకరిద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు మేనేజర్‌గా కూడా పని చేశాడు. కానీ వర్కౌట్‌ కాక తనకంటూ ఏదైనా సొంత పని ఉంటే బాగుండని ఆలోచించాడు. సుమిత్‌ కి ఊహించని ఘటన ఎదురైంది. అతని తండ్రి ఎలక్ట్రిక్ ఆటో నడిపేవారు. ఒకరోజు రాత్రి భోజనం చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించబోయినప్పుడు పాత పైపు పగిలి మంటలు చెలరేగాయి. వాళ్ల నాన్నకు ఛాతీ, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబం మొత్తం మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురైంది. ఇంటి లోన్, ఆటో రిక్షా లోన్ ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో సుమిత్ తన తండ్రి ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాను నడపడం ప్రారంభించాడు. రిక్షా నడపాలి అనేది తన కెరీర్ ప్లాన్లో భాగం కానప్పటికీ అదొక కుటుంబ అవసరంగా.. బతుకు జట్కా బండిగా మారింది. ఆటో రిక్షా నడపడం ప్రారంభించిన తర్వాత సుమిత్ తన సోషల్ మీడియా టాలెంట్ ఉపయోగించాడు. కార్లు, బైక్‌ల చుట్టూ కంటెంట్ సృష్టించేవారు చాలామంది ఉన్నారు కానీ ఆటో రిక్షా గురించి ఎవరూ వీడియోలు చేయడం లేదని గమనించాడు. మొదటి వీడియోలో కుటుంబంతో పెళ్లికి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ చేశాడు. రెండు రోజుల్లోనే అది మిలియన్ వ్యూస్ దాటింది. మొదట్లో ఇరుగుపొరుగు వాళ్లు ఎగతాళి చేశారు. తండ్రి కూడా ‘ఇదేం పనిరా’ అని హెచ్చరించారు. కానీ సుమిత్ దాన్ని సవాలుగా తీసుకుని ఆటో రిక్షాను స్టేజ్‌గా మార్చి మోటివేషనల్ వీడియోలు క్రియేట్ చేసి “ఏ పని చిన్నది కాదు” అని ప్రచారం చేశాడు. ప్రస్తుతం సుమిత్ వారానికి రెండు రోజులు మాత్రమే రిక్షా నడుపుతాడు. అతనికి ఇన్‌స్టా ఫాలోవర్లు వేలల్లో ఉన్నారు. రోజుకు నాలుగైదు బ్రాండ్ ప్రమోషన్లు వస్తున్నాయి. గత నెల రూ.1.5 లక్షలు సంపాదించాడు. ఆ డబ్బుతో కుటుంబ అప్పులు కొంత తీర్చాడు. కంటెంట్ క్రియేషన్‌కు మంచి ఫోన్ కొన్నాడు. చెల్లికి పాకెట్ మనీ ఇచ్చాడు. తల్లిని మొదటిసారి రెస్టారెంట్‌కు తీసికెళ్లినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతకు ముందు అమ్మిన ఇంటిని తిరిగి కొనాలనేది అతని లక్ష్యం. భవిష్యత్తులో ఆటో రిక్షా డ్రైవింగ్‌ను కొనసాగిస్తూనే నటుడిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని కలలు కంటున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిదాయక నిర్ణయం

రన్నరప్ చెక్ ను స్వీకరించి విసిరేసిన పాక్ కెప్టెన్

అమ్మబాబోయ్‌.. ఒకే కిడ్నీలో 1820 రాళ్లు..

టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ నజరానా

ఆసియాకప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన టీమిండియా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *