ఇటీవల విడుదలైన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కు భారతీయులలో విపరీతమైన క్రేజ్ ఉంది. దీన్ని కొనడానికి ప్రజలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కొత్త ఫోన్‌ను పొందడానికి చాలా మంది గంటల తరబడి షాప్స్ వెలుపల క్యూలో గంటల తరబడి నిల్చున్నారు. అయితే కొంతమంది దగ్గర ఈ ఫోన్ ని కొనడానికి డబ్బులు లేవు. దీంతో వారు ఫోన్ ని చూసి సంతోష పడి తృప్తి పడుతుంటే.. ఒక యువతి మాత్రం ఎలాగైనా సరే ఫోన్ కొనాలనే తన కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కొనడానికి తనకు విరాళాలు ఇవ్వమని కోరుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసి.. ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో నివసించే ‘బ్యూటీ క్వీన్’ మహి సింగ్.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఒకటి లేదా రెండు రూపాయలు విరాళంగా ఇవ్వాలని తన ఫాలోవర్స్ ని అడుగుతోంది, దీని ధర భారతదేశంలో దాదాపు ₹1.49 లక్షలు. తన తండ్రి మూడు నెలల క్రితం తనకు ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు మార్కెట్ లో రిలీజైన కొత్త ఆపిల్ ఫోన్ కొనడానికి నిరాకరించారని ఆమె చెబుతోంది. వీడియోలో.. “ఐఫోన్ 17 ప్రో ఇప్పుడే లాంచ్ అయింది. ఈ ఫోన్ రంగు నాకు చాలా నచ్చింది. మూడు నెలల క్రితం.. నాన్న నాకు ఐఫోన్ 16 కొన్నారు. ఇప్పుడు అక్టోబర్ 21న నా పుట్టినరోజున ఈ కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నాను.. అయితే మా నాన్న కొత్త ఫోన్ ని కొనివ్వను అని చెప్పేశారని అంది ఆ సుందరి.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో ప్రజలను డబ్బులు అడగడం
కనుక నా కోరిక తీరాలంటే.. “మీరందరూ ఒకటి లేదా రెండు రూపాయిలతో సహాయం చేస్తే.. నేను ఈ ఫోన్ కొనగలను. నేను చాలా కృతజ్ఞురాలినై ఉంటాను. నా కలను నెరవేరుతుంది.. నిజాయితీగా చెప్పాలంటే నాకు ఈ ఫోన్ చాలా నచ్చింది.. దానిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు” అని మహి తనకు ఫోన్ మీద ఉన్న కోరికను వ్యక్త పరిచింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో @Sajid7642 అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేయబడిన ఈ వీడియోను 38,000 మంది చూడగా.. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ సరదాగా “నేను కూడా నా కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. నేను స్కానర్‌ను ఇన్స్టాల్ చేయాలా?” అని రాశాడు, “దీనిని డిజిటల్ బెగ్గింగ్ అంటారని ఒకరు కామెంట్ చేశారు.
వీడియోను ఇక్కడ చూడండి<
लखीमपुर की ब्यूटी क्वीन माही सिंह एक एक,दो दो रुपये मांग रही है 17 प्रो मैक्स फोन लेने के लिए….. pic.twitter.com/YvpoJymsH9
— Sajid Ali (@Sajid7642) September 25, 2025
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..