మేఘాల్లో ప్రయాణం.. అందుబాటులోకి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా?

మేఘాల్లో ప్రయాణం.. అందుబాటులోకి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా?


ఆసాధ్యాలను సుసాధ్యాలు చేయడంలో చైనా ఎప్పుడూ ముందే ఉంటుంది. టెక్నాలజీని వినియోగించి ఎప్పటికప్పుడూ కొత్తకొత్త ఆవిష్కరణలను సృష్టిస్తుంది. అందుబాలో భాగంగానే తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని నిర్మించింది. చైనాలోని గైజౌ ప్రావిన్స్‌లోని హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ మీదుగా నిర్మించిన ఈ ఎత్తైన వంతెనను ఆదివారం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వంతెనను లోయ నుంచి 625 మీటర్ల ఎత్తులో నర్మించారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన వంతెనగా రికార్డ్‌ క్రియేట్ చేసింది.

బీపన్ నదిపై నిర్మించిన ఈ వంతెన సుమారు 2,900 మీటర్లు పొడవు ఉంటుంది. ఈ వంతెనను నిర్మించడానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది. ఈ వంతెన నిర్మాణంతో రెండు ప్రాంతాల మధ్య రెండు గంటలు పట్టే ప్రయాణం కేవలం రెండు నిమిషాలకు తగ్గిపోయింది. అయితే ఈ వంతెన ప్రారంభోత్సవానికి ముందుగానే దీన్ని అన్ని విధాలుగా టెస్ట్ చేశారు అధికారులు.

ఈ వంతెన పరీక్షలో భాగంగా ఒకేసారిగా 96 భారీ ట్రక్కులను బ్రిడ్జ్‌పై పంపి లోడ్ టెస్ట్‌ నిర్వహించారు. దీని ద్వారా బ్రిడ్జి సామర్థ్యాన్ని, భద్రతను అంచనా వేసి, సురక్షితమని నిర్ధారించారు. ఆ తర్వాతే బ్రిడ్జ్‌పై రాకపోకలకు అనుమతించారు.

అయితే ఈ బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవ సమయంలో తీసిన డ్రోన్ దృశ్యాల ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో బ్రిడ్జ్‌పై నుంచి వెళ్తున్న వాహనాలు చూస్తే అవి మేఘాలను తాకుతూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *