టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు సినిమాలు తగ్గించేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా తన ఇన్ స్టోలో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరలవుతుంది. అందులో తనకు నిజమైన ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదని తెలిపారు.
ముప్పై ఏళ్లలో మహిళలు చూసే ప్రతి విషయం భిన్నంగా ఉంటుందని అన్నారు. 20-30 ఏళ్ల మధ్య ఆలోచనల గురించి తన పోస్టులో రాసుకొచ్చారు. “నేను , నా మేకప్ ఆర్టిస్ట్ తాజాగా ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. ఆ చర్చ నన్ను ఆలోచింపజేసింది. ముప్పై ఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే తీరు మారుతుంది.”
“మీ అందం, అన్నింట్లోనూ మార్పు వస్తుంది. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలంటే ఇరవైలలోనూ ఏదైనా చేయాలి. లేదంటే మీకు ప్రతి దానికి సమయం మించిపోయినట్లు అనిపిస్తుంది. 20 ఏళ్ల వయసులో నేను గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. ఆ మసంయలో నేను ఎంత కోల్పోయానో ఎవరికీ తెలియదు.”
'నిజమైన ప్రేమ మనలోనే ఉంటుందని.. అది బయట నుంచి రాదనే విషయాన్ని ఎవరూ చెప్పలేదు. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమై ప్రేమ అని తర్వాత అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను ముప్పై ఉన్నాను. నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను.
' నేను గతంలో చేసిన తప్పుల తాలూకు జ్ఞాపకాలను మోయడం మానేశను. అన్నిటి వెంట పరుగులు పెట్టడం ఆపేశాను. ప్రతి అమ్మాయి కూడా ఇాలనే ఉండాలని కోరుకుంటున్నాను. పరుగులు తీయడం ఆపేసి జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. అప్పుడే మీరు స్వేచ్ఛగా జీవించగలరు' అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది.