రాజస్థాన్లోని కోట అనంతపురలోని దీప్ శ్రీ భవనంలో ఆదివారం (సెప్టెంబర్ 29) రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో బాలీవుడ్ ఛైల్డ్ ఆర్టిస్ట్ వీర్ శర్మ (10), అతని సోదరుడు శౌర్య శర్మ (15) ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి వీరు తమ ఇంట్లోని ఓ గదిలో నిద్రపోతుండగా. షార్ట్ సర్క్యూట్ జరిగింది. అన్నదమ్ములిద్దరూ పడుకుని ఉన్న రూంతో పాటు హాల్ అంతా పొగ వ్యాపించింది. గాఢనిద్రలో ఉన్న వీర్, శౌర్య కదల్లేక పొగ పీల్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అపార్ట్మెంట్ నుంచి పొగలు వస్తున్నట్లు చూసిన ఇంటి పక్క వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని, తలుపులు పగలగొట్టి ఇద్దరు పిల్లలను బయటికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ పిల్లలిద్దరూ చనిపోయారని డాక్టర్లు ధ్రువీకరించారు. 10 ఏళ్ల వీర్ శర్మ వీర హనుమాన్ సీరియల్ లో లక్ష్మణుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే శ్రీమద్ రామాయణ్ సీరియల్ లోనూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడీ ఛైల్డ్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలోనూ నటిస్తున్నాడు. దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ నెక్స్ట్ సినిమాలో అతని చిన్ననాటి రోల్ పోషిస్తున్నాడు. అయితే ఇంతలోనే ఓ ఘోర విషాదం చోటు చేసుకుంది.
ఇవి కూడా చదవండి
వీర్, శౌర్యల తల్లి రీటా శర్మ కూడా ప్రముఖ నటినే. ఇక తండ్రి జితేంద్ర శర్మ కోటలోని ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగే సమయంలో వీర్ తల్లి మరో గదిలో ఉండగా.. తండ్రి బయటకు వెళ్లారు. దీంతో వీళ్లకు ఏమి కాలేదు. చిన్నారులు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. దీంతో తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే ఇంత బాధలోనూ తమ పిల్లలిద్దరూ కళ్లని దానం చేసేందుకు తల్లదండ్రులు ముందుకు వచ్చారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానులు వీర్ శర్మ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖుల నివాళులు..
CINTAA expresses its deepest condolences on the untimely demise of Veer Sharma and his brother Shaurya Sharma. We pray for eternal peace to the departed souls and strength to the bereaved family to bear this irreparable loss.
.@poonamdhillon @dparasherdp @itsupasanasingh… pic.twitter.com/EGJyV9XDva— CINTAA_Official (@CintaaOfficial) September 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.