నవరాత్రి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి. ఈ ఏడాది సెప్టెంబర్ 30, 2025న దుర్గాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాదేవి చీకటి, అహంకారంపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ రోజున మహా అష్టమి పూజ, సంధి పూజ, కన్యా పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈసారి చంద్రుడు బృహస్పతి రాశి .. ధనుస్సు రాశిలో ఉంటాడు. దీంతో ఈ ఏడాది దుర్గా అష్టమి రోజున ఆధ్యాత్మిక జ్ఞానం, విశ్వాసం, భావోద్వేగ ధైర్యాన్ని పెంచుతుంది. ఈ దుర్గాష్టమి రోజున ప్రతి రాశిపై దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. రాశి ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం శుభప్రదం.
దుర్గాష్టమి రోజున ధనుస్సు రాశిలో చంద్రుని స్థానం దుర్గాదేవి శక్తిని, బృహస్పతి జ్ఞానాన్ని ఏకం చేస్తుంది. ఈ పవిత్ర సంగమం ప్రతి ఒక్కరూ ధైర్యంతో జీవించడం, సత్యాన్ని స్వీకరించడం, భయాన్ని విడిచిపెట్టడం నేర్పే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రోజున ప్రతి రాశి వారు చేసే చిన్న నివారణలతో అమ్మవారి దయకు పాత్రులవుతారు.
మేషరాశి: వీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం కొత్త బలాన్ని పొందుతారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు , కొత్త అవకాశాలు లభిస్తాయి. తొందరపాటును నివారించి ఓపికగా ఉండండి.
పరిహారం: “ఓం దుం దుర్గాయై నమః” జపించండి. ఎరుపు లేదా సింధూరి దుస్తులు ధరించండి. అమ్మవారికి బెల్లం సమర్పించండి.
వృషభ రాశి: ఈ రాశి వారు కొంచెం అశాంతితో ఉంటారు. కొత్త మార్గాలను అన్వేషించాలని కోరుకుంటారు. సంబంధాలలో ఓపికగా ఉండండి. మార్పు మాత్రమే నిజంగా ఎదగడానికి మార్గం.
పరిహారం: సూర్యాస్తమయం సమయంలో నెయ్యి దీపం వెలిగించి, తెల్లటి పువ్వులు సమర్పించి, “యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై” అనే మంత్రాన్ని జపించండి.
మిథున రాశి: వీరు తమ మాట తీరు మెరుగుపరుచుకుంటారు. ఆలోచన తీరు స్పష్టంగా మారుతుంది. వీరు సత్యానికి, భ్రమకు మధ్య తేడాను గుర్తించగలుగుతారు. జ్ఞానం , ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఇది మంచి సమయం. పరిహారం: ఆకుపచ్చని వస్త్రాలు ధరించి.. అమ్మవారికి దానిమ్మపండును సమర్పించి, “ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే” అనే మంత్రాన్ని జపించండి.
కర్కాటక రాశి: కొన్ని పాత భావోద్వేగ గాయాలు మళ్లీ తలెత్తవచ్చు. అయితే వీటిని తెలివిగా ఎదుర్కోనాల్సి ఉంటుంది. ఇంటిల, కుటుంబ సభ్యుల్లో శాంతి తిరిగి నెలకొంటుంది. పరిహారం : అమ్మవారికి పచ్చి పాలు , తామర పువ్వును సమర్పించండి. దుర్గా చాలీసా పారాయణం చేయండి. తెల్లని దుస్తులు ధరించండి.
సింహ రాశి: ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే వీరు అహంకారాన్ని విడనాడాలి. ఎందుకంటే అది సంఘర్షణకు దారితీస్తుంది. సహనం వీరికి సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తుంది.
పరిహారం: ఎర్ర మందార పువ్వులను అమ్మవారికి సమర్పించి, “ఓం కాత్యాయన్యై నమః” అనే మంత్రాన్ని జపించి.. ఆడపిల్లను పూజించండి.
కన్య రాశి: ఈ రాశి వారు తమ ఆరోగ్యం, రోజువారీ దినచర్యపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
పరిహారం: “ఓం హ్రీం దుం దుర్గాయై నమః” అని జపించండి. పెసర పప్పుతో చేసిన ఆహారాన్ని అమ్మవారికి సమర్పించండి. పసుపు రంగు దుస్తులు ధరించండి.
తుల రాశి: ఈ రాశి వారు తన సంబంధాలు, సృజనాత్మక ప్రయత్నాలలో సమతుల్యతని పాటిస్తారు. వీరి నిజాయితీ ప్రేమ సంబంధాలను బలోపేతం చేస్తుంది.
పరిహారం: అమ్మవారికి తెల్ల గంధం సమర్పించి, “ఓం చంద్రఘంటయే నమః” అనే మంత్రాన్ని జపించి, లేత రంగు దుస్తులు ధరించండి.
వృశ్చిక రాశి: వీరిలో ఒక మానసిక మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న పాత సమస్యల నుంచి విముక్తి పొందుతారు. జీవితంలో కొన్ని కొత్త మార్పులు సంభవిస్తాయి.
పరిహారం: అమ్మవారి ముందు ఆవ నూనె దీపం వెలిగించి, “ఓం కాలరాత్ర్యై నమః” అనే మంత్రాన్ని జపించి, ముదురు ఎరుపు రంగు దుస్తులు ధరించండి.
ధనుస్సు రాశి: ఈ రాశిలో చంద్రుడు ఉన్నందున ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. మీ కొత్త ఆలోచనలు, ఆత్మవిశ్వాసం ఉత్తేజితమవుతాయి.
పరిహారం: పసుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించండి, “ఓం దుం దుర్గాయై నమః” అనే మంత్రాన్ని జపించి దుర్గా సప్తశతి చదవండి.
మకర రాశి: వీరికి బాధ్యతలు కొంచెం భారంగా అనిపించవచ్చు అయితే జీవితాన్ని సరైన దిశలో నిర్దేశించుకోవడానికి ఇదే సమయం. విశ్వాసం, క్రమశిక్షణ మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించేలా చేస్తాయి.
పరిహారం: అమ్మవారికి చెరకు లేదా కొబ్బరికాయను సమర్పించి, “ఓం మహాగౌర్యై నమః” అనే మంత్రాన్ని జపించండి. నీలిరంగు దుస్తులు ధరించండి.
కుంభ రాశి: సమాజానికి, ఇతరులకు ఏదైనా మంచి చేసే అవకాశం వీరికి లభిస్తుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతమవుతాయి. అయితే మనసులో అశాంతిని తొలగించుకోండి.
పరిహారం: నువ్వులను దానం చేయండి, అరటిపండ్లను అమ్మవారికి సమర్పించండి. “ఓం స్కందమాతాయై నమః” అనే మంత్రాన్ని జపించండి.
మీన రాశి: వీరి అంతర్ దృష్టి మరింత లోతుగా మారుతుంది. కలలు, ధ్యానం ద్వారా మీరు దైవిక సందేశాలను అందుకోవచ్చు. కరుణ , సౌమ్యత పెరుగుతాయి. మీ మంచి కోసం సంబంధాల మధ్య సరిహద్దులను ఏర్పరచుకోవడం కూడా ముఖ్యం. పరిహారం: అమ్మవారికి తులసి దళాలు, స్వీట్లు సమర్పించండి, “ఓం సిద్ధిదాత్ర్యై నమః” అనే మంత్రాన్ని జపించండి. లేత నీలం రంగు దుస్తులు ధరించండి.