ఆసియా కప్ ప్రజెంటేషన్ సెరిమనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. పాక్ మంత్రి ఏసీసీ చీఫ్ నద్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోమని భారత్ స్పష్టం చేసింది. భారత్ నిర్ణయంతో ఏసీసీ సిబ్బంది ట్రోఫీని వెనక్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా, మ్యాచ్ విన్నింగ్ మెడల్స్ సైతం భారత ఆటగాళ్ళు నిరాకరించారు. ఈ పరిణామాల మధ్య కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంటరాక్షన్ జరగలేదు. ట్రోఫీ, మెడల్స్ లేకుండానే టీమిండియా డగౌట్ దగ్గర విజయోత్సవాలు జరుపుకుంది. పాక్ మంత్రి నుంచి ట్రోఫీ తీసుకోవాలని భావించకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు, అవమాన భారంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు వెనుతిరిగింది. మ్యాచ్ తర్వాత గంట పాటు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమైంది పాకిస్తాన్ జట్టు. పాక్ ప్లేయర్ల వైఖరితో ప్రజెంటేషన్ సెర్మనీ ఆలస్యం అయింది. మ్యాచ్ ముగిశాక గంట దాటినా కూడా సెర్మనీ జరగకపోవడంతో గందరగోళం కనిపించింది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ రన్నరప్ చెక్‌ను విసిరేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆసియా కప్ ఫైనల్ లో సత్తా చూపిన తెలుగోడు తిలక్ వర్మ