మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల యోగం కలిగింది. దీనివల్ల రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. తక్కువ శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు తప్పకుండా హోదా, ప్రాధాన్యం పెరుగుతాయి. కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి ఇది చాలా అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్, రాబడి పెరుగుతాయి.