Mobile Charging Tips: ఈ రోజుల్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అయితే ఫోన్‌ను ఉపయోగించడానికి ప్రత్యేక పద్ధతులు కూడా ఉన్నాయి. లేకపోతే ఇది త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. చాలా మంది తమ ఫోన్‌లను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచుతారు. మీకు ఈ అలవాటు ఉందా? అలా అయితే ఈ అలవాటును మానేయండి. ఎందుకంటే ఇది మీ ఫోన్ బ్యాటరీని దెబ్బతీస్తుంది. మీరు మీ ఫోన్‌ను పదే పదే పూర్తిగా ఛార్జ్ చేస్తే బ్యాటరీ త్వరగా చెడిపోతుంది. అందుకే ఛార్జ్ చేయడానికి సరైన మార్గం గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Indian Railways: భారత్‌లో అత్యంత ఖరీదైన రైలు.. టికెట్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!
ఇవి కూడా చదవండి
మీరు 100 శాతం ఛార్జ్ చేస్తే ఏమవుతుంది?
మీరు పదే పదే 100 శాతం ఛార్జ్ చేస్తే బ్యాటరీ లోపల వేడి పెరుగుతుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. చాలా కంపెనీలు మీ ఫోన్‌ను 80 శాతానికి ఛార్జ్ చేయాలని సిఫార్సు చేస్తున్నాయి. ఆపిల్, శాంసంగ్ వంటి బ్రాండ్లు బ్యాటరీని బాగా ఉంచడానికి వివిధ సిఫార్సులను అందిస్తున్నాయి. ఆ కంపెనీల ప్రకారం.. ఫోన్‌లను ఎల్లప్పుడూ 80% లేదా 90% వరకు ఛార్జ్ చేయాలి. దీని కోసం వారు ఫోన్‌లో కొన్ని ఫీచర్స్ను చేర్చారు. దీని ద్వారా వినియోగదారులు ఛార్జ్‌ను 80 లేదా 90 శాతానికి పరిమితం చేయవచ్చు. కస్టమర్ బ్యాటరీని పదే పదే మార్చాల్సిన అవసరం ఉండదు ఉండదు.
ఇది కూడా చదవండి: LPG Gas Port: అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను మొబైల్ సిమ్ లాగా పోర్ట్?
సరైన ఛార్జింగ్ పద్ధతి:
- రాత్రంతా మీ ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జ్‌లో ఉంచకండి.
- ఎల్లప్పుడూ ఒరిజినల్ ఛార్జర్‌నే ఉపయోగించండి.
- వేడి ప్రదేశాలలో ఛార్జ్ చేయవద్దు.
- ఫోన్ వేడెక్కినప్పుడు ఛార్జర్ నుండి తీసివేయండి.
- పదే పదే ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం ఆపండి.
ఇది కూడా చదవండి: Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా..?