దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!

దసరా, దీపావళి వేళ రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు మరో అమృత్ భారత్ రైల్..!


దీపావళి, ఛత్ పండుగల వేళ భారత రైల్వే శాఖ గుడ్‌న్యూస్ ప్రకటించింది. సోమవారం (సెప్టెంబర్ 29) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను, నాలుగు ప్యాసింజర్ రైళను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో కలుపుతాయి. ఈ సందర్భంగా, అశ్విని వైష్ణవ్ ఛత్ , దీపావళికి 12,000 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా బీహార్‌కు ఏడు కొత్త రైళ్లను అందించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.

అజ్మీర్-దర్భంగా, ఢిల్లీ-ఛప్రా, ముజఫర్‌పూర్-హైదరాబాద్ మధ్య మూడు అమృత్ భారత్ రైళ్లు ఈరోజు సర్వీసులు ప్రారంభించనున్నాయి. ఈ కొత్త రైళ్లలో తక్కువ ఛార్జీలతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందిచనున్నారు. ఈ రైళ్లలో 11 సెకండ్-క్లాస్ కోచ్‌లు, 8 స్లీపర్-క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పన్నెండు అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. మూడు కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో, ఈ సంఖ్య 15కి పెరుగుతుంది.

ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “శుభప్రదమైన నవరాత్రి సందర్భంగా, ప్రధాని మోదీ ‘జీఎస్టీ పొదుపు పండుగ’ బహుమతిని ఇచ్చారు. ఇప్పుడు, ప్రధాని మోదీ నాయకత్వంలో, రైల్వేలలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీహార్‌కు ఏడు కొత్త రైళ్లను బహుమతిగా ఇస్తున్నారు, వాటిలో మూడు అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయి” అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

వీడియో చూడండి.. 

“ముజఫర్‌పూర్-చర్లపల్లి జంక్షన్, దర్భంగా-మదార్ జంక్షన్, ఛప్రా-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య మూడు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనితో పాటు, ఈరోజు నుండి నాలుగు ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రారంభించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే శాఖ వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపాు. రాబోయే రోజుల్లో కొత్త రికార్డులు సృష్టిస్తుంది” అని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *