అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మెుబైల్స్, గ్యాడ్జెట్స్‌తో పాటు ల్యాప్‌టాప్స్‌పై కూడా భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మంచి మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్స్ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. కొత్తగా ల్యాప్‌టాప్ కొనాలనుకునే వాళ్లు ఈ డీల్స్‌పై ఓ లుక్కేయొచ్చు.
మాక్‌బుక్ ఎయిర్ ఎం4
యాపిల్ మ్యాక్ బుక్ కొనాలనుకునే వారు అమెజాన్ సేల్ లో ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు. ప్రస్తుతం యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం4 ను మంచి డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ.99,900 అసలు ధర ఉన్న మ్యాక్ బుక్ సేల్ లో రూ. 83,990కే లభిస్తుంది. క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫర్స్ కూడా కలుపుకుంటే రూ. 82,240కే సొంతం చేసుకోవచ్చు.
ఆసుస్ వివోబుక్ 16
మ్యాక్ బుక్ కాకుండా విండోస్ లో మంచి ప్రీమియం ల్యాప్‌టాప్ కావాలనుకునేవారు ఆసుస్ వివోబుక్ 16 ట్రై చేయొచ్చు. ఇది ప్రీమియం లుక్ తో పాటు లెటెస్ట్ ఫీచర్స్ తో వస్తుంది. పైగా భారీ డిస్కౌంట్ కు లభిస్తుంది. ఇంటెల్ ఐ5 ప్రాసెసర్, 16 ఇంచెస్ డిస్ప్లే ఉండే ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 84,990 కాగా.. సేల్ లో రూ. 51,985కే అందుబాటులో ఉంది.
హెచ్‌పి 15
ఇక బడ్జెట్ లో మంచి ల్యాప్‌టాప్ కోసం చూసేవారు హెచ్ పీ 15 ని ట్రై చేయొచ్చు. లెటెస్ట్ ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, ఫుల్ హెచ్ డీ డిస్ప్లేతో ఉండే ఈ ల్యా్ప్ టాప్ రూ. 35,490కే లభిస్తుంది. కాగా దీని అసలు ధర రూ.52,115 ఉంది. బ్యాంక్, క్రెడిట్ కార్డు డిస్కౌంట్స్ కలుపుకుంటే ఇంకో రెండు వేలు తగ్గొచ్చు.
డెల్ వోస్ట్రో 15
ఇక బడ్జెట్ లో లభించే మరో బెస్ట్ ల్యాప్‌టాప్ డెల్ వోస్ట్రో 15. దీని అసలు ధర రూ. 53,990 కాగా సేల్ లో రూ. 35,990కే లభిస్తోంది. క్రెడిట్ కార్డు ఆఫర్స్ కలుపుకుంటే ఇంకా అదనపు తగ్గింపు పొందవచ్చు. ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ప్లే తో వస్తుంది.
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి