తెలంగాణ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనర్ ప్రజా రవాణాపై తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్ లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో ముచ్చటించారు. ఆర్టీసీ రవాణా సదుపాయాలపై ఆరా తీశారు.
ఇటీవల తెలంగాణ పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది రాష్ట్రప్రభుత్వం. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా శాంతి భద్రతలపై కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా.. తెలంగాణ డీజీపీలతో పాటు, హైదరాబాద్ కు కమిషనర్ లను కొత్తగా నియమించారు. హైదరాబాద్ డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించారు. అదే విధంగా సీపీగా సజ్జనార్ ను నియమించారు. అక్టోబర్ 1న హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..