Income Tax: ఈ ఆదాయానికి ప్రత్యేక పన్ను మినహాయింపు లేదు.. స్పష్టం చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌!

Income Tax: ఈ ఆదాయానికి ప్రత్యేక పన్ను మినహాయింపు లేదు.. స్పష్టం చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌!


Income Tax: సెక్షన్ 87A కింద ప్రత్యేక పన్ను రాయితీ స్వల్పకాలిక మూలధన లాభాలకు వర్తించదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇందులో షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. ఈ రాయితీని క్లెయిమ్ చేసిన పన్ను చెల్లింపుదారులు బకాయి ఉన్న పన్నును చెల్లించడానికి డిసెంబర్ 31, 2025 వరకు గడువు పొడిగించారు. అయితే బకాయి ఉన్న పన్నుపై వడ్డీని మాఫీ చేస్తారు.

ఇది కూడా చదవండి: Indian Railways: భారత్‌లో అత్యంత ఖరీదైన రైలు.. టికెట్‌ ధర ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే!

ఇవి కూడా చదవండి

ఈ విషయంపై ఆ శాఖ ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ “ప్రత్యేక పన్ను రేటుకు లోబడి ఉన్న ఆదాయం” కోసం సెక్షన్ 87A కింద అనేక మంది పన్ను చెల్లింపుదారులు పన్ను రాయితీని క్లెయిమ్ చేశారని పేర్కొంది. ఈ క్లెయిమ్‌లలో కొన్నింటిని మొదట ఆమోదించినప్పటికీ, నిబంధనల ప్రకారం రాయితీ అనుమతించలేమని ఆ శాఖ తరువాత దానిని రద్దు చేసింది. దీని ఫలితంగా ఆ పన్ను చెల్లింపుదారులకు అదనపు పన్ను బాధ్యత ఏర్పడింది. బకాయి ఉన్న పన్నును చెల్లించమని వారికి నోటీసులు జారీ చేసింది.

వడ్డీ మాఫీ చేయాలి

సంబంధిత పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31, 2025 నాటికి తమ బకాయి ఉన్న పన్నును చెల్లిస్తే, చెల్లించాల్సిన వడ్డీని మాఫీ చేస్తామని సర్క్యులర్ పేర్కొంది. మినహాయింపు తప్పుగా మంజూరు చేసి ఆ తర్వాత పన్ను బాధ్యతను తిరిగి అంచనా వేసిన సందర్భాలలో మాత్రమే ఈ ఉపశమనం వర్తిస్తుంది.

సమస్య ఏమిటి?

నిబంధనల ప్రకారం, పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి సెక్షన్ 87A కింద రాయితీ లభిస్తుంది. దీని వలన పన్ను బాధ్యత జీరో అవుతుంది. అయితే జూలై 2024 నుండి కొత్త విధానంలో మొత్తం ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ‘ప్రత్యేక పన్ను రేటుకు లోబడి ఆదాయం’పై రాయితీని మంజూరు చేయడానికి శాఖ నిరాకరించింది. ‘ప్రత్యేక పన్ను రేటుకు లోబడి ఆదాయం’లో షేర్ల అమ్మకం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల వంటి స్వల్పకాలిక మూలధన లాభాలు ఉంటాయి.

కేసు హైకోర్టుకు చేరింది..

ఈ అంశాన్ని అనేక మంది పన్ను చెల్లింపుదారులు బాంబే హైకోర్టులో సవాలు చేశారు. డిసెంబర్ 2024లో ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని కోర్టు ఆ శాఖను ఆదేశించింది. తదనంతరం జనవరి 115, 2025 మధ్య తమ రిటర్న్‌లను సవరించుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం ఇచ్చింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు రాయితీ కోసం ఆశతో అప్డేట్చేసిన రిటర్న్‌లను దాఖలు చేశారు. కానీ వారికి ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఫిబ్రవరి 2025లో చాలా మందికి బకాయి ఉన్న పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు అందాయి.

ఇది కూడా చదవండి: Bank Holidays: నేటి నుండి వరుసగా 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఎందుకో తెలుసా..?

ఇది కూడా చదవండి: LPG Gas Port: అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఇక మీ గ్యాస్ కనెక్షన్‌ను మొబైల్ సిమ్ లాగా పోర్ట్?

ఇది కూడా చదవండి: TVS: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన టీవీఎస్‌ బైక్‌, స్కూటర్ల ధరలు

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *