భవిష్యత్తులో ఆర్ధిక భద్రత కోసం గణనీయమైన మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవాలనుకునేవారికి.. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా.. కొన్ని సంవత్సరాలలో లక్షల విలువైన కార్పస్‌ను నిర్మించవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ లో పొదుపు చేసే మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రభుత్వం హామీ ఇస్తుంది.
కేవలం రూ. 5000 లతో రూ. 8.5 లక్షలను పొందవచ్చు.. ఎలా అంటే
ఎవరైనా ఈ పోస్టాఫీస్ పథకంలో ప్రతి నెలా రూ. 5,000 జమ చేస్తారనుకుంటే.. ఐదు సంవత్సరాలలో.. ఈ పథకంలో దాచిన మొత్తం రూ. 3 లక్షలు.. ఈ డబ్బులకు సుమారు రూ. 56,830 వడ్డీ లభిస్తుంది. అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఈ పతాకంలో వచ్చే మొత్తం రూ. 3, 56,830 ఉంటుంది. ఇలా వచ్చిన ఈ డబ్బులను తీసుకోకుండా.. మళ్ళీ ఈ పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తే.. అంటే మీరు ప్రతి నెలా రూ. 5,000 లు జమ చేయడం మొదలు పెడితే.. మొత్తం 10 సంవత్సరాలు.. ఐదు వేల చొప్పున జమ చేస్తే.. ఈ పొదుపు మొత్తం డిపాజిట్ రూ. 6 లక్షలకు చేరుకుంటుంది. అప్పుడు ఈ మొత్తం మీద రూ. 2, 54,272 వడ్డీ వస్తుంది. అంటే ఈ పతాకంలో పెట్టె ఐదు వేల రూపాయలకు 10 సంవత్సరాల తర్వాత,.. మొత్తంరూ. 8, 54,272 ఉంటుంది. అంటే మీరు నెలకు ₹5,000 మాత్రమే ఆదా చేయడం ద్వారా ₹8.5 లక్షలకు పైగా డబ్బుని పొదుపు చేయవచ్చు.
కేవలం రూ.100 తో పొదుపు చేయడం ప్రారంభిస్తే
ఈ పోస్టాఫీసు పథకం కేవలం ధనవంతుల కోసం మాత్రమే కాదు. ప్రతి నెలా ఎక్కువ ఆదా చేయలేని వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు నెలకు కేవలం రూ. 100లను కూడా పొదుపు చేయవచ్చు. ఈ పొదుపు మొత్తాన్ని క్రమంగా పెంచండి.. కొన్ని సంవత్సరాలలో గణనీయమైన డిపాజిట్ లభిస్తుంది. ఇలా పొదుపు చేయడానికి ఇంతే డిపాజిట్ చేయలనే గరిష్ట పరిమితి లేదు. ప్రతి నెలా మీకు కావలసినంత లేదా మీ బడ్జెట్ కి అనుగుణంగా డిపాజిట్ చేయవచ్చు.
డబ్బు ఎల్లప్పుడూ సురక్షితం
ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు.. డబ్బు పోతుందనే భయం ఉంటుంది. అయితే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం అలాంటి ప్రమాదాన్ని అందించదు. ఈ పథకం ప్రభుత్వ హామీతో కూడుకున్నది. అంటే మీ డిపాజిట్ పూర్తిగా సురక్షితం. బ్యాంక్ డిపాజిట్లలో కూడా ప్రభుత్వం హామీ ₹5 లక్షల వరకు మాత్రమే. అయితే.. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంతో… మీ మొత్తం డిపాజిట్ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.
అవసరమైతే రుణం కూడా పొందవచ్చు.
ఒకవేళ ఎప్పుడైనా మీకు డబ్బు అవసరమైతే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పథకంలో చేరి ఒక సంవత్సరం పూర్తి అయితే.. మీ డిపాజిట్‌లో 50% వరకు రుణం తీసుకోవచ్చు. ఓ వైపు డబ్బు పొదుపు చేసుకుంటే ఉండవచ్చు.. మరోవైపు ఎప్పుడైనా అవసరమైనప్పుడు సహాయం కూడా లభిస్తుంది.
ఆన్‌లైన్‌లో కూడా డిపాజిట్
ఇప్పుడు మీరు ప్రతి నెలా పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఖాతా ఉంటే.. ఇంటి నుండే నెలవారీ వాయిదాలను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
కుటుంబ సభ్యులతో కూడా ఒక ఖాతాను తెరవవచ్చు.
ఈ పథకం కింద మీరు వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యునితో కలిసి ఖాతాను తెరవవచ్చు. అవసరమైతే ఈ ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు కూడా బదిలీ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..