కుక్క గోర్లతో జాగ్రత్త.. గీసుకుంటే ప్రాణాలు పోయినట్టే.. రేబిస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడొస్తుందంటే..

కుక్క గోర్లతో జాగ్రత్త.. గీసుకుంటే ప్రాణాలు పోయినట్టే.. రేబిస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడొస్తుందంటే..


Dog Scratch Cause Rabies Infection?: కుక్కలతో ఆడుకునేటప్పుడు, వాటి గోళ్లు తరచుగా మనుషులను తాకుతాయి.. కొన్ని సార్లు కుక్క గోర్లు గీరుకుపోవడం, గుచ్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు వాటి గోళ్ల ద్వారా రేబిస్ వ్యాపిస్తుందని భయపడతారు. అయితే.. దీని గురించి జాగ్రత్త, ఖచ్చితమైన సమాచారం చాలా అవసరం. ఒక కుక్క ప్రమాదవశాత్తూ రేబిస్ బారిన పడితే, మీరు కూడా వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ అనేది రేబిస్ వైరస్ వల్ల కలిగే ప్రాణాంతకమైన.. ప్రమాదకరమైన వ్యాధి. కుక్క కాటు వల్ల రేబిస్ వస్తుంది. కానీ నేటి ప్రశ్న ఏమిటంటే రేబిస్ కుక్క గోళ్ల ద్వారా కూడా వ్యాపిస్తుందా…? కుక్కలతో ఆడుకునేటప్పుడు, వాటి గోళ్లు తరచుగా మనుషులను తాకుతాయి..? ఇలాంటి పరిస్థితుల్లో కుక్క గోళ్లు గుచ్చుకున్నా.. గీసుకున్నా.. రేబిస్ బారిన పడతామా..? అనే సందేహాలు, ప్రశ్నలు చాలామంది నుంచి వ్యక్తమవుతుంటాయి.. అయితే.. కొన్నిసార్లు ప్రజలు దీనిని పూర్తిగా విస్మరిస్తారు.. ఇది కూడా ప్రమాదకరమని నిరూపించవచ్చు.

గోరు గుచ్చుకుంటే.. సాధారణంగా రేబిస్ వచ్చే ప్రమాదం లేదని వైద్యులు అంటున్నారు. అయితే, గోరు గుచ్చుని లోతైన గాయం ఏర్పడి, కుక్క లాలాజలం గాయంతో సంబంధంలోకి వస్తే, అది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, జాగ్రత్త – సరైన సమాచారం చాలా అవసరం. గోరు గుచ్చుకుంటే.. గాయాన్ని బాగా కడిగి, వైద్యుడిని సంప్రదించండి. ఆలస్యం చేయకూడదు. ఒక కుక్కకు అనుకోకుండా మీకు రేబిస్ సోకితే, మీరు కూడా రేబిస్ బారిన పడవచ్చు, దీనికి చికిత్స చేయలేము.

ఇటీవల తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెంపుడు కుక్క గోరు గుచ్చుకుని.. ఒక యువకుడు రేబిస్ వ్యాధితో మరణించాడు. ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన సందీప్ చేతికి కుక్క కాలి గోరు గుచ్చుకుంది.. అతను చికిత్స పొందకుండా నిర్లక్ష్యం చేయడంతో రేబిస్ వ్యాధి సోకి మరణించాడు..

రేబిస్ ఎలా వ్యాపిస్తుంది?

రాబిస్ వైరస్ సాధారణంగా సోకిన జంతువు లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. కుక్క, పిల్లి లేదా ఇతర జంతువు మనిషిని కరిచినప్పుడు, ఇన్ఫెక్షన్ లాలాజలం ద్వారా గాయానికి వ్యాపిస్తుంది.. అక్కడ వైరస్ శరీరం అంతటా వ్యాపిస్తుంది. అందువల్ల, ఎవరైనా జంతువు కరిచినప్పుడు లేదా గీరినప్పుడు వెంటనే యాంటీ-రాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు వైద్యులు..

కేవలం గోళ్ళ నుంచి కూడా ప్రమాదం ఉందా?

ఘజియాబాద్‌లోని జిల్లా జంతు సంక్షేమ అధికారి డాక్టర్ ఎస్పీ పాండే, స్క్రాచ్ నుండి రేబిస్ సంక్రమించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరిస్తున్నారు. అయితే, ఇటీవల ఒక కుక్క తన గోళ్లను లేదా పాదాల గోర్లు లేదా పాదాలు మీ చర్మానికి గుచ్చుకుని లేదా గీరుకుని.. రక్తస్రావం కలిగిస్తే, ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. అనంతరం కుక్క లాలాజలం మీ గాయంతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు.. రేబిస్ వస్తుందని స్పష్టంగా అర్థం చేసుకోవాలని తెలిపారు.

డాక్టర్ ఏమంటున్నారంటే..

కుక్క మిమ్మల్ని గీరినట్లయితే, ముందుగా ఆ ప్రాంతాన్ని సబ్బుతో కడగాలని వైద్యులు సలహా ఇస్తారు. గాయాన్ని సబ్బు, నీటితో 10 నిమిషాల పాటు పదే పదే కడగాలి. ఇది వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. గోరు లోతుగా గుచ్చుకుని.. రక్తస్రావం అయితే, లేదా కుక్కకు రేబిస్ వ్యాక్సిన్ తీసుకోకపోతే, మీరు వైద్యుడిని సంప్రదించాలి. మీ పరిస్థితిని బట్టి, మీ వైద్యుడు యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ (ARV) లేదా టెటనస్ షాట్ (TT) ఇవ్వమని సిఫారసు చేయవచ్చు.

మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?

గాయం లేదా.. గోరు గుచ్చుకున్న గాయం లోతుగా ఉన్నప్పుడు..

గోళ్ల గాయం నుండి రక్తస్రావం అయినప్పుడు..

కుక్కకు టీకాలు వేయకపోయినప్పుడు.. (వీధిలో తిరిగే కుక్కలు అయినప్పుడు)

కుక్క గీరడానికి ముందు లేదా గీరిన తర్వాత గాయాన్ని నాకినప్పుడు..

కుక్క గోళ్ళు గీసుకుని.. దాని నుండి లోతైన గాయాలు అయినప్పుడు..

ఇలా జరిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

టీకాల పూర్తి కోర్సును పూర్తి చేయడం ఎల్లప్పుడూ ముఖ్యం.

మధ్యలో ఆగిపోతే ప్రమాదం పొంచిఉంటుంది.

కుక్కలు లేదా ఇతర జంతువులు కొరికినా.. లేదా గీరినా.. కరిచినా ఇంటి నివారణలను పాటించకండి.. సకాలంలో టీకాలు వేయించుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *