ప్రస్తుతం థియేటర్లలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా హవానే నడుస్తోంది. దీంతో ఈ దసరా పండగకు తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. రిషభ్ శెట్టి ‘కాంతార 1’ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ వంటి డబ్బింగ్ చిత్రాలు మాత్రమే థియేటర్లలో విడుదల కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఆసక్తికర సినిమాలు, వెబ్ సి రీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో లిటిల్ హార్ట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ కు కడుపుబ్బా నవ్వించిన ఈ మూవీ ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. అలాగే జూనియర్స్, మదరాసి సినిమాలు కూడా ఉన్నంతలో కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీటితో పాటు శ్రద్ధా శ్రీనాథ్ ‘ద గేమ్’ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో రానుంది. మరి దసరా పండగ సందర్భంగా ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.
ఇవి కూడా చదవండి
ఆహా
- జూనియర్ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 30
ఈటీవీ విన్
- లిటిల్ హార్ట్స్ (తెలుగు సినిమా)- అక్టోబరు 01
The blockbuster rom-com of the year coming to your home…💖
This time longer, sweeter & crazier!💞
Little Hearts (Extended Cut 🤩)
A WIN Original ProductionStreaming from Oct 1 only on @etvwin @marthandsai #AdityaHasan @mouli_talks @shivani_nagaram @TheBunnyVas… pic.twitter.com/zc12LfIhQl
— ETV Win (@etvwin) September 26, 2025
నెట్ఫ్లిక్స్
- మిస్సింగ్ కింగ్ (జపనీస్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 29
- నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 30
- ద గేమ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
- మాన్స్టర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
అమెజాన్ ప్రైమ్ వీడియో
- మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 01
- ప్లే డర్టీమూవీ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 01
సన్ నెక్స్ట్
- సాహసం (తమిళ మూవీ) – అక్టోబరు 01
- గౌరీ శంకర (కన్నడ సినిమా) – అక్టోబరు 01
- టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
జీ5 ఓటీటీలో..
చెక్ మేట్ (మలయాళ సినిమా) – అక్టోబరు 02
డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) – అక్టోబరు 02
జియో హాట్స్టార్
- అన్నపూరణి (మూవీ)- అక్టోబరు 01
సోనీ లివ్
- 13th (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబరు 01
ఆపిల్ ప్లస్ టీవీ
- ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
- లాస్ట్ బస్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 03
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.