
గోల్డ్ రేట్ రోజుకో కొత్త రికార్డులను బ్రేక్ చేస్తోంది. సామాన్యులు, మధ్య తరగతి వాళ్లకే కాదు ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా దూసుకెళ్తోంది. మన దేశంలో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాల అన్నింటిలోనూ బంగారం కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. ఇలాంటి సమయంలో తులం బంగారం ధర ఏకంగా లక్ష 16 వేలు దాటడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది కష్టంగా మారింది. బంగారంపై పెట్టుబడులు ఎక్కువ కావడం.. గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతోంది. అయితే రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో గోల్డ్ రోజురోజుకు పెరుగుతుండటం.. పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది.. బంగారం బాటలోనే.. వెండి ధరలు కొనసాగుతున్నాయి.. ఇలా బంగారం, వెండి ధరలు సరికొత్తగా రికార్డులను తిరగరాశాయి.. తాజాగా.. సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి..
దేశీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.920 మేర ధర పెరిగి.. రూ.1,16,400 కి చేరింది..
22 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.850 మేర ధర పెరిగి.. రూ.1,06,700 కి చేరింది.
వెండి కిలోపై రూ.1000 మేర ధర పెరిగి.. 1,50,000కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.1,16,400 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,06,700 ఉంది. కిలో వెండి రూ.1,60,000 లకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,16,400 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,06,700 ఉంది. కిలో వెండి రూ.1,60,000 లకు చేరుకుంది.
భారతదేశంలో బంగారం ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.
ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..