తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1,743 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో డ్రైవర్ పోస్టులు 1000, శ్రామిక్ పోస్టులు 743 వరకు ఉన్నాయి. అయితే మరో పది రోజుల్లో ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 8, 2025వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ విండో ఓపెన్ కానుంది. ఈ క్రమంలో ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
ఆర్టీసీ భర్తీ చేయనున్న ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, ఐటీఐలో సంబంధిత కోర్సులో సర్టిఫికెట్ ఉండాలి. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 5 ఏళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులు 3 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులను అక్టోబర్ 28, 2025వరకు స్వీకరిస్తారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఫిజికల్ మెజర్మెంట్ (పీఎంటీ), మెడికల్, డ్రైవింగ్ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. డ్రైవర్ పోస్టులకు జనరల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. శ్రామిక్ పోస్టులకు జనరల్ అభ్యర్ధులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చొప్పున చెల్లించాలి. ఎంపికైన వారికి నెలకు డ్రైవర్ పోస్టులకు రూ.20,960 నుంచి రూ.60,080 వరకు, శ్రామిక్ పోస్టులకు నెలకు రూ.16,550 నుంచి రూ.45,030 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇవి కూడా చదవండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.