Suryakumar Yadav : పాకిస్థానీ జర్నలిస్ట్‌కు సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే కౌంటర్..ఏమైనా నీ టైమింగ్ సూపర్ బాసూ

Suryakumar Yadav : పాకిస్థానీ జర్నలిస్ట్‌కు సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే కౌంటర్..ఏమైనా నీ టైమింగ్ సూపర్ బాసూ


Suryakumar Yadav : పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా ఆసియా కప్ 2025 ఛాంపియన్‌గా నిలవడంతో టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న.. కేవలం ప్రశ్నలా కాకుండా, పాకిస్థాన్ ఓటమి పట్ల అతనిలోని ఆవేదన, అక్కసు మొత్తం బయటపడినట్లు అనిపించింది. దీనికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది.

టీమిండియా ఆసియా కప్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ మీడియాతో మాట్లాడటానికి వచ్చారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న అడగడంలో అతను చూపించిన ఆవేదన, కోపం మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిని జీర్ణించుకోలేని ఒక అభిమాని భావోద్వేగాన్ని ప్రతిబింబించింది.

పాకిస్థానీ జర్నలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ వైపు తిరిగి.. మీరు హ్యాండ్‌షేక్, ఫోటో సెషన్ చేయకపోవడం కేవలం రాజకీయ పరమైన ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వంటివి చేశారు. మీరు పాకిస్థానీ జట్టుతో ఇలా ఎందుకు ప్రవర్తించారు? క్రికెట్‌లో రాజకీయాలు తీసుకువచ్చిన మొదటి కెప్టెన్ మీరే అని మీరు అనుకోవడం లేదా? అంటూ తనలోని నిరాశను మొత్తం ఒకే ప్రశ్నలో కుమ్మరించాడు. అంటే, టోర్నమెంట్ అంతటా భారత్-పాక్ ఆటగాళ్ల మధ్య సరైన స్నేహపూర్వక వాతావరణం లేకపోవడానికి, అలాగే మీడియా సమావేశాల్లో రాజకీయ అంశాలు చర్చకు రావడానికి సూర్యకుమార్ యాదవే కారణమని ఆ జర్నలిస్ట్ ఆరోపించాడు.

పాకిస్థానీ జర్నలిస్ట్ ప్రశ్నించిన తీరు చూసి సూర్యకుమార్ యాదవ్ మొదటగా నవ్వారు. ఆ తర్వాత కూల్‌గా ఆ జర్నలిస్ట్‌ను ఉద్దేశించి.. “గుస్సా హో రహే హో ఆప్?” (మీరు కోపంగా ఉన్నారా?) అని సరదాగా అడిగారు. సూర్యకుమార్ యాదవ్ ఆ మాట అన్న విధానం ఆ జర్నలిస్ట్ గాయాలపై ఉప్పు చల్లినట్లుగా ఉంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరింత మెచ్యూర్డ్‌గా స్పందిస్తూ.. “మీరు ఒక్కసారిగా చాలా విషయాలు అడిగేశారు. అందుకే మీ ప్రశ్న ఏంటో సరిగా అర్థం కాలేదు” అని అన్నారు. ఈ విధంగా భారత కెప్టెన్ ఆవేశంగా బదులివ్వకుండా, తెలివిగా, నవ్వుతూ ఆ వివాదాస్పద ప్రశ్నను హ్యాండిల్ చేశారు.

టీ20 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు టీమ్ ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ నాయకత్వ పటిమ అద్భుతం. వ్యక్తిగతంగా ఆయన బ్యాటింగ్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్నా.. కెప్టెన్‌గా మాత్రం టోర్నమెంట్ అంతటా జట్టును అజేయంగా ఉంచి, ఆసియా కప్ విజేతగా నిలబెట్టాడు. ఈ విజయం ఆయన కెప్టెన్సీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *