ఆర్‌ఎస్‌ఎస్ ‘సంఘ్ గీత్’ ఆల్బమ్‌ను ఆవిష్కరించిన ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్..

ఆర్‌ఎస్‌ఎస్ ‘సంఘ్ గీత్’ ఆల్బమ్‌ను ఆవిష్కరించిన ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్..


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శనివారం (సెప్టెంబర్ 27) 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. స్థానిక క్యాలెండర్ (విక్రమ్ సంవత్) ప్రకారం విజయదశమి (అక్టోబర్ 2) నాడు సంఘ్ తన శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం, సంఘ్ సెప్టెంబర్ 27, 1925న నాగ్‌పూర్‌లో స్థాపించడం జరిగింది. ఆ రోజు విజయదశమి (దసరా), స్థానిక క్యాలెండర్ ఆధారంగా సంఘ్ దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రెండు డజన్ల మంది స్వచ్ఛంద సేవకులతో స్థాపించిన సంఘ్, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా విస్తరించింది. శతాబ్ది సంవత్సరంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 28) ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ “సంఘ్ గీత్” ఆల్బమ్‌ను విడుదల చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన సంఘ్ గీత్ ఆవిష్కరణ కార్యక్రమంలో, భగవత్ ఈ పాటను మాతృభూమికి అంకితం చేశారు. మాతృభూమి పట్ల భక్తి, నిష్ఠ కలిగిన జీవితం వివరించడమే సంఘ్ గీత్ అని ఆయన అన్నారు. ఈ పాటలు స్వచ్ఛంద సేవకుల జీవిత అనుభవాల నుండి ఉద్భవించాయి. ఈ ఆల్బమ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ పాటల సమాహారం ఉంది.

“సంఘ్ గీత్” ఆల్బమ్‌లో శంకర్ మహదేవన్ 25 పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో మహదేవన్ వీటిలో 10 పాటలను పాడి వినిపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతి భారతీయ భాషలోనూ దాదాపు 25,000 నుండి 30,000 పాటలు పాడిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన భగవత్ అన్నారు. ఈ పాటల సారాంశం అంకితభావ స్ఫూర్తిలో ఉంది. వాటి స్వరకర్తల పేర్లను గుర్తించడం చాలా కష్టమన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. సంఘ్ గీత్ ఆవిష్కరణను ఒక చారిత్రాత్మక సంఘటనగా నితిన్ గడ్కరీ అభివర్ణించారు. ఈ పాటలు దేశభక్తికి ప్రేరణగా పనిచేస్తాయని ఆయన అన్నారు. ప్రతి సంఘ్ గీత్ ఎంతో స్ఫూర్తిదాయకమైనదని, విలువైన జీవిత పాఠాలను నేర్పుతుందని సీఎం ఫడ్నవీస్ అన్నారు.

సంఘ్ దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయదశమి రోజున జరుపుకుంటుంది. దసరా నాడు నాగ్‌పూర్‌లో జరిగే ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది స్థాపనను పురస్కరించుకుని జరిగే ప్రధాన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. తొలిసారిగా నాగ్‌పూర్‌లో మూడు ‘పాత్ సంచాలన్’ (స్వచ్ఛంద కవాతులు) జరుగుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *